సోషల్ మీడియా ద్వారా క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీలలో ఇనాయ సుల్తానా ఒకరు. దర్శకుడు రాంగోపాల్ వర్మతో ఓ వీడియో కారణంగా ఆమె రాత్రికి రాత్రే క్రేజ్ పాపులర్ అయిపోయింది. కానీ.. ఆ వీడియో వల్లే ఎన్నో ట్రోల్స్ కూడా ఫేస్ చేసింది. అయితే.. ఇనాయ లైఫ్ బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్నాక మారిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఇనాయ అంటే బిగ్ బాస్ కి ముందు, బిగ్ బాస్ కి తర్వాత అన్నట్లుగా కెరీర్ ని ప్లాన్ చేసుకుంటోంది. ఆల్రెడీ బిగ్ బాస్ కి ముందే పలు సినిమాలలో నటించినప్పటికీ, పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ.. బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ ని బాగానే సద్వినియోగం చేసుకుంటోంది బ్యూటీ.
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఇనాయ.. బిగ్ బాస్ తర్వాత సినిమాలలో అయితే కనిపించలేదు. కానీ.. తనకంటూ వచ్చిన ఫేమ్ తో స్పెషల్ ఈవెంట్స్.. షాప్ ఓపెనింగ్స్.. ప్రోగ్రామ్స్ అంటూ అటెండ్ అవుతోంది. ఈ క్రమంలో ఇటీవల రాజమండ్రిలో జరిగిన ‘హరిత-యువత’ కార్యక్రమంలో పాల్గొంది. నగరంలోని సిమెంట్రీపేట అశోకా థియేటర్ వద్ద జరిగిన జగనన్న హరిత నగరాలు కార్యక్రమంలో భాగంగా ‘హరిత-యువత’ ప్రోగ్రాంలో ఇనయ సుల్తానా అక్కడ మెరిసింది. ఈ ప్రోగ్రామ్ లో ఇనాయతో పాటు బిగ్ బాస్ జస్వంత్ జెస్సీ, సిరి హన్మంత్, శ్రీహాన్ కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎంపీ మార్గాని భరత్ తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది అమ్మడు.
అంతేగాక ఫొటోలతో పాటు ఎంపీ భరత్ చాలామంచి వ్యక్తి అని కొనియాడుతూ పోస్ట్ లో పేర్కొంది ఇనయ. ప్రస్తుతం ఎంపీ భరత్ తో ఇనాయ సుల్తానా కలిసున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. ఈ ఫోటోలపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఎంపీ భరత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ‘యువత-హరిత’ కార్యక్రమంలో ఈ బిగ్ బాస్ బ్యూటీ మొక్కలు నాటడం విశేషం. అనంతరం ఎంపీ భరత్ చేసిన ‘గో గ్రీన్ ఛాలెంజ్’ను స్వీకరించి తాము బాధ్యతగా నాటిన మొక్కలను కాపాడుకుంటానని ఇనాయ ప్రామిస్ కూడా చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయా మొక్కల వద్ద పేర్లతో బోర్డులు ఏర్పాటు చేశారు. మరి వినూత్నమైన ప్రోగ్రాంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.