బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన సోహెల్ - ఇనాయ సుల్తానా. అరే.. వీరిద్దరూ ఎప్పుడు కలిశారు? ఎప్పుడు ఆ యాంగిల్ లో కనిపించలేదే.. అని మీకు అనిపించవచ్చు. కానీ..
వాలెంటైన్స్ డే అనేది ప్రతి ఏడాదికి ఓసారి రిపీట్ అవుతూనే ఉంటుంది. సాధారణంగా కొత్తగా ప్రేమలో పడినవారు లేదా ప్రేమలో పడబోయేవారికి ఈ లవర్స్ డే ఎంతో స్పెషల్ గా అనిపిస్తుంది. ఇదంతా నార్మల్ ఆడియెన్స్ విషయంలోనే ఇంత స్పెషల్ గా ఉంటే.. ఈ లవ్ ఫీల్ సెలబ్రిటీల విషయంలో ఎలా ఉంటుందో ఊహించుకోండి. ప్రెజెంట్ బిగ్ బాస్ షో ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ సంపాదించుకున్న ఇద్దరు సెలబ్రిటీల ప్రపోజల్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇన్నాళ్లు విడివిడిగా కనిపించిన వీరిద్దరూ ఒక్కసారిగా ప్రపోజల్ వీడియోతో కనిపించేసరికి ఫ్యాన్స్, ఆడియెన్స్ షాక్ అవుతున్నారు.
మరి వారెవరూ అనే వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన సోహెల్ – ఇనాయ సుల్తానా. అరే.. వీరిద్దరూ ఎప్పుడు కలిశారు? ఎప్పుడు ఆ యాంగిల్ లో కనిపించలేదే.. అని మీకు అనిపించవచ్చు. కానీ.. తాజాగా రోజ్ కలర్ డ్రెస్ ధరించి, చేతిలో రోజా పువ్వు పట్టుకొని సోహెల్ కి ప్రపోజ్ చేసింది ఇనాయ. ఆమె ప్రపోజల్ కి సోహెల్ కూడా ఫిదా అవ్వడం మనం వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోని ఇనాయ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. వీరి వీడియో చూసి జనాలు సర్ప్రైజ్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే హ్యాపీ రోజ్ డే అని క్యాప్షన్ కూడా మెన్షన్ చేసేసరికి వీరి మధ్య లవ్ కన్ఫర్మ్ అంటూ కామెంట్స్ లో అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు నెటిజన్స్. ఇక వీరి మధ్య ఏముంది? అనేది వారే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.