బిగ్ బాస్ 6వ సీజన్ లో రెండు వారాలు చాలా నార్మాల్ గా గడిచిపోయాయి. రేటింగ్స్ దారుణంగా వచ్చాయి. దీంతో వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున.. ఒక్కొక్కరిని నిలబెట్టి మరీ క్లాస్ తీసుకున్నాడు. పనిలో పనిగా కౌంటర్స్ కూడా వేశాడు. దీంతో హౌసు మొత్తం సీరియస్ గా మారిపోయింది. దానికి తోడు సోమవారం జరిగిన నామినేషన్స్ వల్ల అది కాస్త మరోస్థాయికి వెళ్లింది. ఈ క్రమంలోనే గీతూ-సుదీప గట్టిగా అరుస్తూ గొడవపడ్డారు. కొట్టుకోవడం ఒక్కటే తక్కువైంది. దీంతో వీళ్లిద్దరి వాగ్వాదం కాస్త చర్చనీయాంశమైంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. గతవారం సిసింద్రీ టాస్కులో భాగంగా ఎవరికి వారు.. తమ జీవితంలో జరిగిన సంఘటనల గురించి చెప్పుకున్నారు. కన్నీళ్లు పెట్టుకున్నారు, బాధపడ్డారు. అంతా బానే ఉంది. కానీ సోమవారం జరిగిన నామినేషన్స్ లో అప్పుడు జరిగిన విషయాన్నే గీతూ ప్రస్తావించింది. సుదీప ఎమోషన్ తో ఆడుకున్నట్లు కనిపించింది. ఇక సుదీపని నామినేట్ చేసిన గీతూ.. ‘ప్రాక్టీసు వాట్ యూ ప్రీచ్ అని ఇంతకు ముందు చెప్పారు, కానీ మీరు పాటించలేదు. మొన్న ఎమోషనల్ అవుతూ మీరు కన్నీళ్లు తుడుచుకున్నారు. ఆ టిష్యూలని అక్కడే వదిలేశారు’ అని గీతూ కారణం చెప్పింది.
గత రెండు వారాల నుంచి చాలా సైలెంట్ గా ఉన్న సుదీప కూడా ఈ విషయంపై ఫుల్ ఫైర్ అయిపోయింది. అదిరిపోయే కౌంటర్ వేసింది. ‘ఆ రోజు అందరూ ఎమోషనల్ అయి కన్నీళ్లు తుడుచుకుని టిష్యూలు ఓ మూల పడేశారు. ఇంత సిల్లీ రీజన్ కి నన్ను నామినేట్ చేశావంటే.. నీ బుద్ధి ఎలాంటిదో అర్ధమైంది’ అని గీతూకి క్లాస్ పీకింది. గత రెండు వారాల నుంచి అందరిపై అరుస్తూ, డామినేషన్ చూపిస్తున్న గీతూకే సుదీప క్లాస్ పీకడంతో మిగతా కంటెస్టెంట్స్ అవాక్కయ్యారు. మరి సుదీప, గీతూపై కౌంటర్స్ వేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి:హౌస్ మేట్స్ పరువు తీసేసిన బిగ్ బాస్ ఆరోహి!