బిగ్ బాస్ తెలుగు సీజన్-6 కొత్త లోగో, ప్రోమోతో తెలుగు ప్రేక్షకుల్లో సందడి మొదలైపోయింది. అప్పగింతల వరకు కూడా ఆగలేకపోయారంటే ఆట మొదలైనట్లే.. అంటూ కింగ్ నాగార్జున చెప్పిన డైలాగుతో ప్రేక్షకుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. హాలీవుడ్ నుంచి అందిపుచ్చుకున్న ఈ రియాలిటీ షో కాన్సెప్ట్ ఇండియాలో విడుదలైన అన్ని భాషల్లో మంచి సక్సెస్ అయ్యింది.
తెలుగులో అయితే ఐదు సీజన్లు పూర్తి చేసుకుని ఆరో సీజన్లోకి కూడా అడుగుపెట్టబోతోంది. అటు బిగ్ బాస్ ఓటీటీ కూడా ఒక సీజన్ సక్సెస్‌ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఇప్పుడు అంతా బిగ్ బాస్ తెలుగు సీజన్-6 ఎప్పుడెప్పుడు మొదలవుతోందా అనే ఎదురుచూపులు. ప్రోమో కూడా రావడంతో ఇప్పుడు ప్రేక్షకుల్లో అసలు ఎవరు కంటెస్టెంట్లుగా వెళ్లనున్నారు? అనే వెతుకులాట మొదలైంది.
ఇదే ఫైనల్ లిస్ట్ అంటూ కొందరి పేర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా వీళ్లే దాదాపుగా ఫైనల్ అవబోతున్నారు అని కూడా తెలుస్తోంది. ఎప్పటిలాగానే ఈసారి కూడా బిగ్ బాస్ సీజన్ 6లో యూట్యూబర్లు, బుల్లితెర సెలబ్రిటీలు, కమెడీయన్లు, యాంకర్లు, సినిమా వాళ్లనే తీసుకుంటున్నారు. వారితో పాటుగా ఇద్దరిని కామన్ మెన్ క్యాటగిరీలో తీసుకుంటున్నారు. మొత్తం 19 మంది సభ్యుల్లో 15 మంది మొదటిరోజు వెళ్లగా ఇంకో నలుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వెళ్తారని తెలుస్తోంది. ఆ లిస్ట్ లో ఉన్న సెలబ్రిటీలు ఎవరో చూద్దాం.
ఉదయభాను:
ఒకప్పటి స్టార్ యాంకర్ ఉదయభాను ప్రస్తుతం మూవీ ఈవెంట్స్, యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పటి స్టార్ యాంకర్, డాన్సర్, హోస్ట్ అని తెలిసిందే. ఇంకా ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదనే చెప్పాలి. అందుకే బిగ్ బాస్ యాజమాన్యం సైతం ఉదయభానుని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆమె వ్యక్తిగత అంశాలు కూడా బిగ్ బాస్ కు మైలేజ్ ఇస్తాయంటూ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
నేహా చౌదరి:
ఐపీఎల్ ప్రేక్షకులకు అయితే నేహా చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. నేహా చౌదరికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ నేహా చౌదరి ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. లాస్ట్ సీజన్లోనే బిగ్ బాస్ కు వెళ్తున్నట్లు పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈసారి మాత్రం తప్పకుండా వెళ్లనున్నట్పలు తెలుస్తోంది. గ్లామరస్ యాంకర్‌గా మంచి మార్కులు కొట్టేసిన నేహా చౌదరి బిగ్ బాస్ లో ఏమాత్రం రాణిస్తుందో చూడాలి మరి.
గలాటా గీతూ:
చిత్తూరు యాసతో సోషల్ మీడియాలో ఫేమ్ తెచ్చుకున్న గలాటా గీతూ అందరికీ సుపరిచితమే. ఇప్పుడు జబర్దస్త్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. అంతేకాకుండా ఆమె ఫాలోయింగ్ కూడా బాగానే పెరిగింది. గలాటా గీతూ బిగ్ బాస్ లో అడుగు పెడితే బాగా రాణిస్తుంటుందంటూ భావిస్తున్నారు.
శ్రీహాన్:
షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు చూసే వారికి శ్రీహాన్ గురించి ఇంట్రడక్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. గత సీజన్లో అతని లవర్ సిరి వెళ్లడం, షణ్ముఖ్-సిరి ఫ్రెండ్‌షిప్ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం తెలిసిందే. అయితే ఆ విషయంలో మాత్రం శ్రీహాన్ కు బాగా సింపథీ, ఫాలోయింగ్ పెరిగింది. ఇప్పుడు అది బిగ్ బాస్ కు బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నార. శ్రీహాన్ వెళితే మాత్రం తప్పకుండా టైటిల్ ఫేవరెట్ అవుతాడంటున్నారు.
ఆదిరెడ్డి:
ఆదిరెడ్డి అలియాస్ బొడ్డు వెంకట నారాయణ.. బిగ్ బాస్ రివ్యూలతో బాగా ఫేమస్ అయ్యాడు. మనోడు చెప్పే రివ్యూలకు యూట్యూబ్‌లో మంచి డిమాండ్ ఉంది. ప్రతి వీడియోకి మిలియన్లలో వ్యూస్ వస్తుంటాయి. అయితే ఈసారి ఆదిరెడ్డి తప్పకుండా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెడతాడంటూ గట్టిగా చెబుతున్నారు. అదే నిజమైతే అన్నీ తెలిసిన ఆదిరెడ్డి ఏ స్టైల్‌లో గేమ్ ఆడతాడు అనేది కూడా ఆసక్తిగా మారనుంది.
చలాకీ చంటి:
జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటీ కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెడతాడంటూ చెబుతున్నారు. అయితే అది కచ్చితంగానా లేదా అనేది మాత్రం చెప్పలేము. ఎందుకంటే అవినాష్ వెళ్లిన సమయంలో రూ.10 లక్షలు కట్టాను అని చెప్పాడు. మరి చంటి అంత రిస్క్ తీసుకుని వస్తాడా? అనేది కూడా ప్రశ్నగా మారనుంది. వస్తే మాత్రం తప్పకుండా ఎంటర్‌టైన్మెంట్ నెక్ట్స్ లెవల్ ఉంటుంది.
జబర్తస్త్ అప్పారావు:
అప్పారావు జబర్దస్త్ మానేసినా కూడా అతని ఇంటిపేరు మాత్రం జబర్దస్త్ అని అందరికీ తెలిసిందే. ప్రస్తుతం స్పెషల్ ఈవెంట్స్, కామెడీ షో చేస్తున్న అప్పారావు బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ఇంక చంటి, అప్పారావు బాండింగ్ ఇంట్రస్టింగా ఉండబోతోంది.
వీళ్లే కాకుండా ఇంకా కొంత మంతి పేర్లు వినిపిస్తున్నాయి. కానీ, నిజానికి ఎవరు బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెడతారు అనేది చివరి క్షణం వరకూ ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే వారు ఒక 25 మంది సభ్యులను సెలక్ట్ చేసి రెడీగా ఉంచుతారు. వారిలో నుంచి లాంచింగ్ రోజు 15 మందిని పంపుతారు. వాళ్లు ఎవరు అన్నది లైవ్‌లో చూసే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ బిగ్ బస్ లిస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.