ఒక్కసారి బిగ్ బాస్ ఆట మొదలుపెడితే.. ఏ బాసూ ఉండరిక్కడ. ఎందుకంటే ఆ రేంజ్ లో మజా ఇస్తాడు మరి. అలాంటి బిగ్ బాస్ ఈసారి వారం కూడా గడవక ముందే ఊహించని ట్విస్టులు ఇస్తున్నాడు. గత సీజన్లలో తొలి వారం నామినేషన్స్ చాలా సిల్లీగా ఉండేవి. వచ్చిన తర్వాతి రోజే నామినేషన్ ప్రక్రియ ఉండేది. కానీ ఈసారి రూట్ మార్చారు. దీంతో ఈ ప్రక్రియ చాలా విచిత్రంగా సాగింది. ట్విస్టుల మీద ట్విస్టులు ఉండేసరికి సేవ్ అయ్యారనుకున్న వాళ్లు నామినేట్ అయ్యారు. నామినేట్ అయ్యారనుకున్న వాళ్లు సేవ్ అయిపోయారు.
ఇక అసలు విషయానికొస్తే.. గత సీజన్లలో బిగ్ బాస్ ప్రారంభ ఎపిసోడ్ ఆదివారం జరిగేది. తర్వాతి రోజే నామినేషన్స్ ఉండేవి. దీంతో కంటెస్టెంట్స్ కి సరైన కారణాలు దొరికేవి కావు. అందుకే ఈ సీజన్ కోసం డిఫరెంట్ గా ఆలోచించిన బిగ్ బాస్ టీమ్.. నామినేషన్స్, కెప్టెన్సీ టాస్కులు వైవిధ్యంగా పెట్టారు. క్లాస్-మాస్-ట్రాష్ టాస్కుతో ఆసక్తిగా మార్చేశారు. ఇందులో ప్రతిభ చూపించిన గీతూ, ఆదిరెడ్డి, నేహా చౌదరి.. నామినేషన్స్ నుంచి తప్పించుకుని కెప్టెన్సీ పోటీదారులు అయిపోయారు. ట్రాష్ లోని ఇనయా, అభినయ, బాలాదిత్య నేరుగా నామినేట్ అయిపోయారు.
దీనికి తోడు ఈ వారం నామినేషన్స్ టాస్క్ యమ ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో.. వాళ్ల పేరు పేపరుపై రాసి, టాయిలెట్ సీట్లో వేయాలి. ఎక్కువగా ఎవరి పేర్లు అందులో పడతాయో వాళ్లు నామినేట్ అయినట్లు. అలా ఈ ప్రక్రియలో మొత్తం ఏడుగురు నిలిచారు. వాళ్లే ఆరోహి, ఇనయా, అభినయ, రేవంత్, ఫైమా, శ్రీసత్య, చంటి. నిజానికి బాలాదిత్య కూడా నామినేట్ అయ్యాడు కానీ క్లాస్ సభ్యులు.. ట్రాష్ లోని ఒకర్ని సేవ్ చేయొచ్చు అనేసరికి బాలాదిత్య బదులు ఆరోహిని నామినేషన్స్ లో పెట్టారు. ఈ ఏడుగురిలోనూ రేవంత్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. సో అతడు సేవ్ కావడం గ్యారంటీ. చంటి, ఫైమా కూడా కాస్త ఫేమ్ ఉన్న పర్సన్సే కాబట్టి వాళ్లు కూడా ఎలిమినేట్ కాకపోవచ్చు. మిగిలిన నలుగురిలోనే ఒకరు హౌస్ నుంచి బయటకెళ్లిపోవచ్చు. మరి ఆ ఒక్కరు ఎవరని మీరనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: బిగ్ బాస్-6 లో ఫస్ట్ లవ్ ట్రాక్! RJ సూర్య, కీర్తి మధ్య ప్రేమ చిగురిస్తుందా?