బిగ్ బాస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. ఈరోజుకి సేఫ్ జోన్ లో ఉన్నాం అనుకునే వాళ్లు.. రేపటికల్లా డేంజర్ జోన్ లో పడతారు. అసలు జాబితాలోనే లేనివాళ్లు ఎలిమినేట్ అయిపోతుంటారు. ఇలాంటి సంఘటనలే ప్రతి సీజన్ లోనూ జరుగుతున్నాయి. కాబట్టి ఈ సీజన్ అంతకు మించి ఉండనుందని ప్రేక్షకులు ఓ అంచనాకు వచ్చేశారు. తొలి మూడు ఎపిసోడ్స్ చూస్తే అలానే అనిపిస్తోంది కూడా. క్లాస్-మాస్-ట్రాష్ అని ఈ సీజన్ లో బిగ్ బాస్ ఫస్ట్ టాస్క్ ఇచ్చాడు. అది మంగళవారంతో పూర్తయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం ఎపిసోడ్ లో స్లైడ్ జరా స్లైడ్ టాస్కులో సింగర్ రేవంత్ తో అభినయశ్రీ తలపడింది. ఇద్దరూ బాగా కష్టపడినప్పుటికీ రేవంత్ విజేతగా నిలిచాడు. దీంతో రేవంత్ మాస్ లోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రోల్ బేబీ రోల్ టాస్క్ లో ఇనయా, నేహా చౌదరి పోటీపడ్డారు. పాచికలను పోలిన బాక్సులు నిర్ణీత ప్రదేశంలో పెట్టాల్సిన ఈ టాస్కులో నేహా గెలిచింది. ఈ గేములో తనకు మద్ధతు లభించకపోవడం వల్లే ఓడిపోయానని ఇనయా బాధపడింది. ఆదిరెడ్డి ఆమెని నచ్చజెప్పే ప్రయత్నం చేయగా, రేవంత్ కలుగజేసుకుని.. గెలుపు మన సత్తాపై ఆధారపడి ఉంటుందని అన్నాడు. దీంతో ఇనయా కామెంట్స్ వెనక్కి తీసుకుంది.
ఇలా పలు టాస్కులు పెట్టిన బిగ్ బాస్.. ‘క్లాస్-మాస్-ట్రాష్’ ముగిసిందని బిగ్ బాస్ చెప్పాడు. టాస్క్ పూర్తయ్యే నాటికి గీతూ, ఆదిరెడ్డి, నేహా చౌదరి.. క్లాస్ లో ఉండటం వల్ల ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యారు. ట్రాష్ లో మిగిలిన అభినయ శ్రీ, బాలాదిత్య, ఇనయా.. ఎలిమినేషన్ ని నేరుగా నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. సేవ్ అయిన గీతూ, ఆదిరెడ్డి, నేహా ముఖంలో ఆనందం కనిపించగా.. అభినయ, ఇనయా ముఖంలో మాత్రం టెన్షన్ కొట్టిచ్చినట్లు కనిపించింది. అదే గ్రూపులో ఉన్న బాలాదిత్య మాత్రం చాలా కూల్ గా కనిపించాడు.
దీన్నిబట్టి చూసుకుంటే.. బిగ్ బాస్ హౌసులో మూడో రోజు పలు ఆసక్తికర విషయాలు జరిగాయి. మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ లో కొందరు సేవ్ అయ్యారు. కొందరు డేంజర్ జోన్ లో పడ్డారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఫస్ట్ టాస్కులో పెట్టిన రెండు గేమ్స్ లోనూ ఇనయా ఓడిపోయింది. ఈమెతోపాటు ట్రాష్ లో ఉన్న గీతూ క్లాస్ లోకి, రేవంత్ మాస్ లోకి వెళ్లిపోయారు. దీంతో ఈ వారం ఇనయా ఎలిమినేట్ అయిపోతుందా అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి ఎలిమినేట్ అయ్యే దురదృష్టవంతులు ఎవరని మీరనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: సింగర్ రేవంత్ ఏడుపు.. ఉండలేక ఆ ఫుడ్ తినలేక!