బిగ్ బాస్ 6లో సింగర్ రేవంత్ ఓ కంటెస్టెంట్ గా ఉన్నాడు.. ఫస్ట్ ఈ పేరు వినగానే చాలామంది తెగ ఎగ్జైట్ అయ్యారు. ఎందుకంటే మనోడు ఎనర్జీకి పెట్టింది పేరు. సింగర్ అయినా సరే చాలా విషయాల్లో చురుగ్గా ఉంటాడు. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతాడు. అలాంటి సింగర్ రేవంత్, బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడనే సరికి చాలామంది అతడిపై అంచనాలు పెంచేసుకున్నారు. కానీ షో ప్రారంభమైన రెండు రోజుల్లో సీన్ రివర్స్ అయిపోయింది. రేవంత్ కి ఏడుపు ఒక్కటే తక్కువైైంది. ఇంతకీ హౌస్ లో ఏం జరుగుతోంది? ఇక వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ ఇంట్లో ఎవరు అడుగుపెట్టినా సరే టాస్కులు, గొడవలు గ్యారంటీ. వాటిని తట్టుకుని ఉంటేనే చివరి వరకు నిలుస్తారు. లేదంటే కొన్ని వారాల్లో ఎలిమినేట్ అయిపోతారు. ఇక రేవంత్ కూడా హౌస్ లోకి వచ్చీ రాగానే.. మిగతా పార్టిసిపెంట్స్ విషయాల్లో తలదూర్చాడు. వాళ్ల విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యాడు. దీంతో అందరికీ టార్గెట్ అయి ట్రాష్ లో పడ్డాడు. ఈ గ్రూప్ లో ఉంటే గార్డెన్ ఏరియాలో పడుకోవాలి, అక్కడే తినాలి. ఇది రేవంత్ వల్ల కాలేదు. ఇక స్విచ్ సదుపాయం వచ్చిన టైమ్ లోనూ తను కాదని, గీతూని క్లాస్ లోకి పంపించేశాడు. ఆ తర్వాత రేవంత్ చాలా డల్ అయిపోయాడు. ఉదయం నుంచి ఏం తినలేదు అని చెబుతూ బాత్రూమ్ దగ్గర కన్నీరు పెట్టుకున్నాడు. ట్రాష్ టీమ్‌లో వారికి ఇచ్చిన ఫుడ్ తినలేకపోతున్నా ఉదయం నుంచి తినకుండానే ఉన్నాడు. రోల్ బేబీ రోల్ ఛాలెంజ్ లో అభినయపై గెలిచిన రేవంత్.. ట్రాష్ నుంచి మాస్ లోకి వచ్చేశాడు. దీంతో అతడి ఆకలి బాధలు తీరిపోయాయి.అంతకు ముందు క్లాస్ గ్రూప్ లోకి వెళ్లిపోయిన గీతూ.. రేవంత్ ని కనీసం అరటిపండు అయినా తినమని కోరింది. దీంతో విసుక్కున్న రేవంత్.. నువ్వు ఏ పని చెప్పినా చేస్తా.. బాత్రూమ్ లు కడగమన్నా.. చివరికి ఇక్కడున్న వారందరివి కడగమన్న కడుగుతా అని మధ్యలో ఓ బూతు పదం వాడాడు. వెంటనే అక్కడున్న బాలాదిత్య రేవంత్ పై సీరియస్ అయ్యాడు. దీంతో నాలుక్కర్చుకున్న రేవంత్.. బిగ్ బాస్ కెమెరా ముందుకొచ్చి బిగ్ బాస్ కి సారీ చెప్పాడు. ఇకపై అలా మాట్లాడనని అన్నాడు. ఇదీ చదవండి: సింగర్ రేవంత్ సక్సెస్ వెనుక ఎన్ని ఛీత్కారాలు, విషాదాలో..!