బాలాదిత్య.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకులకు ఎప్పటినుంచో పరిచయం. ఆ తర్వాత చంటిగాడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక బాలాదిత్య హీరోగా వచ్చిన 1940లో ఓ గ్రామం సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు.. ఎన్నో అవార్డులు అందుకుంది. కానీ ఇవేవి బాలాదిత్య కెరీర్‌కు ఉపయోగపడలేదు. ఆ తర్వాత బుల్లితెర మీద యాంకర్‌గా రాణించాడు. ఇక తాజాగా బిగ్‌బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి అందరి మనసులు గెల్చుకున్నాడు. మంచితనానికి మారుపేరుగా.. గుర్తింపు తెచ్చుకున్నాడు. వయసులో, అనుభవంలో మిగతా కంటెస్టెంట్ల కంటే పెద్దవాడు కావడంతో.. హౌస్‌లో కూడా అదే హుందాతనం చూపాడు. టాస్క్‌ల విషయంలో టఫ్ కాంపిటేషన్ ఇస్తూనే.. వివాదాలు తలెత్తితే.. ఎంతో సౌమ్యంగా.. నొప్పించక.. తానొవ్వక అన్న రీతిలో మాట్లాడుతూ.. సామరస్యంగా పరిష్కరించేవాడు. హౌస్‌లో అతడి ఆటతీరు, ప్రవర్తన చూసి.. చాలా మంది ఈ సీజన్ విన్నర్ బాలాదిత్యే అని ఫిక్సయ్యారు.
హౌస్‌లోకి ఎంటరైన నాటి నుంచి మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న బాలాదిత్య.. సిగరెట్ల కోసం గీతుతో గొడవపడటం.. అతడిపై నెగిటివ్ ప్రభావం చూపింది. బిగ్‌బాస్ హౌస్ అంటేనే మనలోని అన్ని రకాల ఎమోషన్స్ బయటకు తీసుకువచ్చే వేదిక. అలాంటి ప్లాట్‌ఫాం మీద.. బాలాదిత్య సిగరెట్ల కోసం గీతుతో గొడవపడటం.. కఠినంగా మాట్లాడటంతో.. ప్రేక్షకుల్లో అతడిపై వ్యతిరేకత పెంచింది. దాంతో.. 10 వారం హౌస్ నుంచి బయటకు వచ్చాడు. ఆ సమయంలో కూడా ఎంతో హుందాగా ప్రవర్తించి.. మరోసారి అందరిని ఆకట్టుకున్నాడు.
ఇక బాలాదిత్య బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చే ముందు అతడి భార్య.. రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ వెంటనే బాలాదిత్య హౌస్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. దాంతో కుమార్తెకు నామకరణ వేడుక నిర్వహించలేదు. బాలాదిత్య హౌస్ నుంచి బయటకు వచ్చాకా.. తాజాగా మంచి ముహూర్తం కుదరడంతో డిసెంబర్ 15న బాలాదిత్య రెండో కూతురి నామకరణ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో బిగ్‌బాస్ సీజన్ 6 నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ పాల్గొన్నారు. ఆర్జే సూర్య, గీతూ, ఇనయా, ఆరోహిరావు,వాసంతి ఈ వేడుకకు హాజరయ్యి సందడి చేశారు. ఇక కుమార్తెకు యజ్ఞ విధాత్రి అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.