బిగ్ బాస్ షో ద్వారా మంచి ఫేమ్, ఫాలోయింగ్ సంపాదించుకున్న సోషల్ మీడియా సెలబ్రిటీలలో సిరి హన్మంత్ ఒకరు. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు చేస్తూ ఉండే సిరి.. బిగ్ బాస్ తో ఒక్కసారిగా అటు టీవీ ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. అయితే.. బిగ్ బాస్ లో చివరి వరకు ఉండగలిగింది కానీ తన పర్సనల్ లైఫ్ పరంగా చాలా ట్రోల్స్ ఎదురుకుంది.
బిగ్ బాస్ 5వ సీజన్ కారణంగా అటు దీప్తి – షణ్ముఖ్, ఇటు సిరి – శ్రీహాన్ ప్రేమ జంటల మధ్య దూరం పెరిగిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ నుండి బయటికి రాగానే షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పేసింది దీప్తి. 5 ఏళ్ల లవ్ స్టోరీకి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. మరోవైపు శ్రీహాన్ తన ప్రొఫైల్ లో సిరి ఫోటోలు డిలీట్ చేయడంతో ఈ జంట కూడా విడిపోనుందని అంతా అనుకున్నారు.తాజాగా ఈ జంట ఒక్కటై.. తమపై వచ్చిన బ్రేకప్ వార్తలన్నీ ఫేక్ అని నిరూపించారు. ఇటీవలే సిరి – శ్రీహాన్ హైదరాబాద్ లో యాంకర్ రవి ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ చేశారు. అనంతరం రవి ఫ్యామిలీతో సందడి చేసి ఫోటోలు కూడా దిగారు. వీరి కలిసిన ఫోటోలను యాంకర్ రవి భార్య నిత్య సక్సేనా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. అలాగే ‘మీ ఇద్దరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది’ అంటూ ఇంస్టా స్టోరీలో పోస్ట్ పెట్టింది. అయితే బిగ్ బాస్ టైంలో ఎంత దూరం ఏర్పడినా మళ్లీ కలవడంతో ఫ్యాన్స్ హ్యాపీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక వీరు కలిసినట్లుగానే దీప్తి – షణ్ముఖ్ కలిస్తే బాగుండు అని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మరి సిరి – శ్రీహాన్ లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.