వెండితెరపై పెద్దగా సక్సెస్ రాని వారంతా బుల్లితెరకు వస్తుంటారు. అక్కడ నటించేందుకు అవకాశం ఉండటంతో పాటు సంపాదన కూడా ఉంటుంది. సీరియల్స్, ప్రోగ్రామ్స్ చేస్తూనే సినిమాల్లో ప్రయత్నాలు చేస్తుంటారు. తమను తాము నిరూపించుకునేందుకు ఆత్రుత కనబరుస్తుంటారు. . అటువంటి వారిలో ఒకరు నటి హరితేజ.
వెండితెరపై పెద్దగా సక్సెస్ రాని వారంతా బుల్లితెరకు వస్తుంటారు. ఇక్కడ వారికి ఎక్కువ స్కోప్ ఉండటంతో పాటు సంపాదన కూడా ఉంటుంది. అయితే బుల్లితెరకు వచ్చేసినప్పటికీ.. వెండితెరపై మనస్సు లాగుతూనే ఉంటుంది. సీరియల్స్ చేస్తూనే అటు సినిమాలో చిన్న క్యారెక్టర్ వచ్చినా చేయాలని తమ ప్రయత్నాలు మానరు. చిన్న అవకాశం దక్కిన వదులుకోరు. తమను తాము నిరూపించుకునేందుకు ఆత్రుత కనబరుస్తుంటారు. అలా చాలా మంది అటు వెండితెరలోనూ, ఇటు బుల్లితెరలోనూ కనిపిస్తూ… ఇరు పక్షాల అభిమానుల్ని అలరిస్తూ ఉంటారు. అటువంటి వారిలో ఒకరు నటి హరితేజ. కెరీర్ మొదట్లో చిన్న చిన్న సినిమాలు చేసిన ఈ టాలెంట్ నటి.. ఆ తర్వాత బుల్లి తెరవైపుకు వెళ్లింది. మనసు, మమత అనే టివీ సీరియల్స్ లో నటించినా ఆమె మనసంతా వెండితెరపైనే..
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, విలేజ్‌లో వినాయకుడు, అందరి బంధువయ్య అనే సినిమాలు చేసినప్పటికీ.. హరితేజ అంటే అందరికీ తెలిసింది మాత్రం మాటల మాంత్రికుడు తివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సమంత, నితిన్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘అ ఆ’తోనే. ఈ సినిమాలో అందరి కన్నా ముందు గుర్తుకు వచ్చే పాత్ర మంగమ్మ. ఈ పాత్రలో హరితేజ మెప్పించిన తీరు అద్భుతం. సెటైర్స్, కౌంటర్స్‌తో కూడిన కామెడీ చేస్తూ ఆద్యంతం నవ్వులు పూయించారు. అయితే ఈ సినిమాతో ఆమెకు సినిమా చాన్సులు వరుస కడతాయని భావించారు కానీ.. రాలేదు. అయితే అటు సీరియల్స్ లో కూడా కనిపించలేదు. ఆ తర్వాత ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే ఆ తర్వాత 2017లో వచ్చిన బిగ్ బాస్ 1లో పాల్గొని బెస్ట్ కంటెస్టెంట్‌గా నిలిచింది. ఈ సిజన్‌కు జూ.ఎన్టీఆర్ హోస్ట్ కాగా, ఆమె చెప్పిన హరి కథకు ఆయన సైతం ఫిదా అయ్యారు. ఆ సీజన్‌లో థర్డ్ ప్లేస్ లో నిలిచింది. చాలా బొద్దుగా కనిపించే ఈ అమ్మడు.. సడెన్‌గా చేంచ్ అయింది. ఈ అమ్మడు తన సోషల్ మీడియా ద్వారా కొన్ని ఫోటోలు షేర్ చేయగా.. అవి చూసిన నెటిజన్లంతా హరితేజా అని తదేకంగా చూస్తున్నారు.
ఆ ఫోటోల్లో చాలా సన్నగా, నాజుగ్గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత లావుగా మారిన హరితేజ.. ఇప్పుడు తగ్గడంపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. అయితే దీనిపై పలువురు కామెంట్లు పెడుతున్నారు. మరి అంత సన్నగా ఉంటే ఎలా మేడం, బాలేదు..బొద్దుగా నే బావుంటారు…కొంత మంది మీ వెయిట్ లాస్ జర్నీ గురించి చెప్పండని, మీ చార్మ్ కోల్పోయారని మరో నెటిజన్ కామెంట్స్ చేశారు . హరితేజ తను మంచి కూచిపూడి డ్యాన్సర్ కూడా. సీరియల్స్‌తో పాటు దిక్కులు చూడకు రామయ్య , అందరి బంధువయ, దమ్ము, దువ్వాడ జగన్నాధం, అనగనగా ఓ ధీరుడు , విన్నర్ , అత్తారింటికి దారేది , ఉంగరాల రాంబాబు , రాజా ది గ్రేట్ వంటి తెలుగు చిత్రాలలో నటించింది. త్వరలో మరోసారి కమ్ బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యినట్లు కనిపిస్తోంది.