సోషల్ మీడియా వచ్చినప్పటినుండి హీరోయిన్ల చిన్నప్పటి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం పాపులారిటీ సంపాదించుకుంటున్న భామలు ఇలా వారి చిన్నప్పటి ఫొటోలతో ఆడియన్స్ కి సర్ప్రైజ్ ఇవ్వడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇప్పటికే ఇలాంటివి మీరు చాలానే చూసేసి ఉంటారు. ఇక ఇప్పుడు మరో కొత్త ఫోటో గుర్తుపట్టగలరేమో చూద్దాం.
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు లాంగ్ కెరీర్ కొనసాగించడం అంత సామాన్యమైన విషయం కాదు. ఇక ఒక హీరోయిన్ దాదాపు రెండు దశాబ్దాలుగా తన కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా నెట్టుకురావడం అంటే వేళ్ళ మీద లెక్క పెట్టుకోవాల్సిందే. అయితే ఒక హీరోయిన్ మాత్రం ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళైనా వరుసపెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ నేటికీ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఇక నాలుగు పదుల వయసులో కూడా చెక్కు చెదరని అందంతో కుర్ర భామలకు గట్టి పోటీ ఇస్తూ స్టార్ హీరోల పక్కన ఛాన్సులు కొట్టేస్తుంది. ఇదంతా కుర్చీలో కూర్చున్న ఈ చిన్నారి గురించి చెబుతున్న మాటలు. మే నెల 4 ఈ చిన్నారి పుట్టినరోజు. ఈ నేపథ్యంలో ఈ పాన్ ఇండియా హీరోయిన్ చిన్నప్పటి ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఆమె కెరీర్ ప్రారంభించి 20 సంవత్సరాలు దాటేసింది. కెరీర్ అంతటా స్టార్ హీరోలతో, కుర్ర హీరోలతో నటించి ఒకానొక దశలో సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ గా నిలిచింది. అందం అభినయంలో ఆమెకి ఆమె సాటి. మధ్యలో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ కనబడకపోయినా.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతుంది. ఈపాటికే ఈ చిన్నారి ఎవరనేది మీకొక క్లారిటీ వచ్చిందా?చెప్పమంటారా ? ఆమె ఎవరో కాదు ఒకప్పుడు సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష.
కేరళకు చెందిన త్రిష తొలిసారి జోడి అనే తమిళ్ సినిమాలో సపోర్టింగ్ రోల్లో కనిపించింది. ఆ తర్వాత 2002 లో తమిళ్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన త్రిష.. 2004 లోప్రభాస్ కి జోడిగా వర్షం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఈ కేరళ బ్యూటీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసబెట్టి స్టార్ హీరోలతో నటిస్తూ చాలా తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. పొన్నియన్ సెల్వన్ తో త్రిష మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ ని గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో త్రిష గ్లామర్ చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇక ఈ మధ్యే విడుదలైన పొన్నియన్ సెల్వం 2 భారీ విజయాన్ని సొంతం చేసుకోగా.. కోలీవుడ్ స్టార్ విజయ్ తో లియో సినిమాలో నటిస్తుంది. మరి ఈ చిన్నారి ఫోటోను చూస్తుంటే మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.