కాబోయే భార్య రాథికా మర్చంట్‌తో కలిసి అనంత్ అంబానీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
దేశ కళారంగాన్ని, సాంస్కృతిక వైభవాన్ని, సంప్రదాయ కళలను ప్రోత్సహించడం కోసం అంబానీ ఫ్యామిలీ ఓ కల్చరల్ సెంటర్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఆర్థిక రాజధాని ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ లో సరికొత్తగా.. అత్యంత విశాలంగా ఈ కల్చరల్ సెంటర్ నిర్మింపబడింది. దానికి ‘‘నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్’’ అని పేరు పెట్టారు. దేశంలోనే అతి పెద్ద సాంస్కృతిక కేంద్రంగా ఈ కట్టడం నిలువనుంది. ఇక, ఈ భవనం ప్రారంభోత్సవానికి దేశంలోని రాజకీయ, సినీ, క్రీడా, పారిశ్రామిక ప్రముఖులందరూ వచ్చారు.
ఈ వేడుకలో కాబోయే భార్యాభర్తల జంట అనంత్ అంబానీ, రాథికా మర్చంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంత్, రాథికాలు జంటగా ఈ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం వారికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అనంత్ బ్లాక్ కోటు, ప్యాంట్స్‌లో.. రామా గ్రీన్ చీరలో రాథిక మర్చంట్ అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక, ఈ భవన ప్రారంభోత్సవ వేడుకలకు సచిన్ టెందూల్కర్, అంజలి, సచిన్ కూతురు సారా, అభినవ్ బింద్రా,
సానియా మీర్జా, దీపా మాలిక్, షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్, సల్మాన్ ఖాన్, సిద్ధార్థ్-కియారా అడ్వాణీ, దీపికా పదుకొణె-రణ్‌వీర్ సింగ్, ప్రియాంకా చోప్రా-నిక్ జొనాస్, ఐశ్వర్యరాయ్, రజనీకాంత్, ఆయన కుమార్తె సౌందర్య, సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్, ఆమిర్ ఖాన్, కరణ్ జోహార్, షాహిద్ కపూర్ తదితరులు హాజరయ్యారు. మరి, వైరల్‌గా మారిన అనంత్, రాథికా మర్చంట్‌ల ఫొటోలు, వీడియోలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.