వెండితెరపై బెస్ట్ జోడిగా అలరించారు నాగ చైతన్య, సమంత. ఏమాయ చేశావో షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట, 2017లో వివాహం చేసుకున్నారు. అయితే 2021లో అభిమానులకు షాక్ నిస్తూ తాము విడిపోతున్నామంటూ ప్రకటించారు. దీనికి వెనుక కారణాలను వెల్లడించలేదు. అయితే ఇప్పుడు నాగ చైతన్య మరో నటితో డేటింగ్ లో ఉన్నట్లు రూమర్లు వస్తుండగా...
తెలుగు తెరపై క్యూటెస్ట్ కపుల్ అనగానే గుర్తుకు వచ్చే వారిలో ముందు వరుసలో ఉంటారు సమంత, నాగ చైతన్య. రీల్ లైఫ్‌ను రియల్ లైఫ్‌గా మార్చుకున్న ఈ జోడీ సంసారం సాఫీగా సాగలేదు. ప్రేమను పెళ్లి రూపంలో పండించుకున్న వీరి బంధం మూణాళ్ల ముచ్చటగా ముగిసింది. 2021 అక్టోబర్ 2న విడాకులు తీసుకున్నట్లు ఇద్దరు సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రకటించారు. తాము భార్యాభర్తలుగా కొనసాగలేమని, విడిపోయినప్పటికీ తాము స్నేహితులుగా ఉంటామని చెప్పారు. అయితే ఈ వార్తతో ఫ్యాన్స్ సైతం ఆవేదన చెందారు. ఎవరిదీ తప్పు, ఎవరిదీ ఒప్పు అనే విషయాన్ని పక్కన పెడితే.. అసలు విడిపోవడానికి కారణాలు ఇవనీ ఇద్దరూ చెప్పలేదు. పలు మార్లు ఇంటర్వ్యూలో్ పాల్గొన్న వీరి మ్యారేజ్ బ్రేకప్‌పై ప్రశ్నలను సైతం యాంకర్లు ఎవైడ్ చేస్తూ వచ్చారు. విడిపోయాక ఎవరీ పనుల్లో వారు బిజీగా గడుపుతున్నారు.
అయితే నాగ చైతన్య మాత్రం ఓ నటితో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్లు వచ్చాయి. ముందుగా కృతి శెట్టి పేరు వినపడింది. అయితే గతేడాది నాగ చైతన్య ఇంట్లో శోభిత దూళిపాళ్ల కనిపించడంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు హల్ చల్ చేశాయి. తాజాగా ఈ రూమర్స్ బలం చేకూరే విధంగా ఓ పిక్ ఒకటి నెట్టింట్లో దర్శనమిచ్చింది. అందులో నాగచైతన్యతో పాటు శోభిత కనిపిస్తున్నారు. అదీ లండన్‌లో దిగినట్లుగా కనిపిస్తోంది. లండన్‌లో డిన్నర్ డేట్‌కు వెళ్లిన ఫోటోల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జమావర్‌లో డిన్నర్ డేట్‌కు సంబంధించిన పిక్ అని సమాచారం. అక్కడి చెఫ్ సురేందర్ మోహన్.. నాగ చైతన్యతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అయితే, ఇదే ఫొటోలో బ్యాక్‌గ్రౌండ్‌లో టేబుల్ దగ్గర శోభిత కూర్చోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని గమనించిన నెటిజన్లు.. ఆమె శోభిత ధూళిపాళనే అని కామెంట్స్ చేస్తున్నారు.
గతేడాది నవంబర్‌లో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ లండన్ వెకేషన్‌లో కలిసి ఉన్న ఫొటో నెట్టింట వైరల్ కావడంతో ఇద్దరి మధ్య డేటింగ్ రూమర్స్ ఎక్కువయ్యాయి. అయితే ఇది ఫోటో ఎడిటింగ్ అని కొందరు చెప్పారు. ఇప్పుడు ఈ ఫోటోను బట్టి చూస్తే వారు లండన్ కు వెళ్లినట్లు స్పష్టమౌతోంది. వీరి డేటింగ్ పై ఓ సారి నాగ చైతన్యకు ప్రశ్నకు ఎదురు కాగా, నవ్వుతో సమాధానం ఇచ్చారు. ఇక వారి సీక్రెట్ రిలేషన్ గురించి ఎప్పుడు రివీల్ చేస్తారో వెయిట్ చేయాల్సిందే. గతేడాది లాల్ సింగ్ చద్దాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన నాగచైతన్య కస్టడీ మూవీ ద్వారా కోలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకులు. బైలింగ్వల్ సినిమాగా తెరకెక్కుతోంది. కృతి శెట్టి మరోసారి నాగ చైతన్యతో జత కట్టబోతోంది. అరవింద్ స్వామి విలన్‌గా నటిస్తున్నారు. నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ‘కస్టడీ’ మూవీ మే 12న విడుదల కానుంది.