‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ అట్టహాసంగా ముగిసింది. విన్నర్ గా వీజే సన్నీ రెమ్యూనరేషన్, ప్రైజ్ మనీ, ప్లాట్ అన్నీ కలిపి రూ.కోటిపైనే అందుకున్నాడు. విన్నర్ రెమ్యూనరేషన్ కంటే ఇప్పుడు రన్నరప్ షణ్ముఖ్ జశ్వంత్ రెమ్యూనరేషన్ పై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
బిగ్ బాస్ 5 తెలుగు నిర్వాహకుల నుంచి షణ్ముఖ్ కు భారీగానే రెమ్యూనరేషన్ అందిందనే లెక్కలు వినిపిస్తున్నాయి. మరోవైపు విన్నర్ తో పాటు రన్నరప్ కు కూడా సువర్ణ కుటీర్ లో ప్లాట్ ఇస్తామని ప్రకటించారు. అంటే రెమ్యూనరేషన్ తో పాటు షణ్ముఖ్ కు రూ.25 లక్షల విలువజేసే ఒక ప్లాట్ కూడా వచ్చింది. ఇవన్నీ కలుపుకుంటే షణ్ముఖ్ కు విన్నర్ కు తీసిపోకుండానే ముట్టినట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది.
ఇది కూడా చదవండి: సన్నీ బిగ్ బాస్ 5 విన్నర్ అవ్వడానికి కారణాలు!
బిగ్ బాస్ లోకి రాకముందే షణ్ముఖ్ జశ్వంత్ సోషల్ మీడియాలో ఒక స్టార్ రేంజ్ లోఉన్నాడు. ఒక స్టార్ హీరోకి ఉండే ఫాలోయింగ్ కు ఏ మాత్రం తీసిపోని ఫ్యాన్ బేస్ షణ్ముఖ్ జశ్వంత్ కు ఉందనేది నిజం. అందుకే షణ్ముఖ్ అడిగినంతకు బిగ్ బాస్ వాళ్లు ఓకే చెప్పినట్లు సమాచారం. ఆ లెక్కల ప్రకారం షణ్ముఖ్ జశ్వంత్ కేవలం రెమ్యూనరేషనే రూ.కోటి దాకా అందినట్లు తెలుస్తోంది. దానికి అదనంగా రూ.25 లక్షల విలువజేసే ప్లాట్ కూడా అందింది. అంటే బిగ్ బాస్ నుంచి షణ్ముఖ్ కు రూ.కోటి నుంచి రూ.1.30 కోట్లు దాకా అందిందని తెలుస్తోంది. షణ్ముఖ్ జశ్వంత్ రెమ్యూనరేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.