పవిత్ర లోకేశ్. తెలుగు వారికి సుపరిచితమైన పేరు. సినిమాలతోనే కాదూ నరేష్‌తో సహజీవనం చేస్తూ వార్తల్లో నిలిచారు. వీరిద్దరూ నటించిన మళ్లీ పెళ్లి థియేటర్లలో సందడి చేస్తోంది. కన్నడ నుండి తెలుగులోకి అడుగుపెట్టిన పవిత్ర.. షూటింగ్ సమయంలోనే నరేష్‌తో ప్రేమలో పడింది. యంగ్ హీరోలకు తల్లి పాత్రలు పోషించి మంచి పెరు తెచ్చుకుంది. ఇప్పుడు..
సినిమా ఇండస్ట్రీలో వివాదాస్పదాలతో అందరి నోళ్లలో నానుతున్న జంట నరేష్-పవిత్ర లోకేశ్. వీరి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమానే మళ్లీ పెళ్లి. సినిమా ప్రకటన నుండి సినిమా ప్రచారం కోసం ఈ జంట చేయని విన్యాసాలు, రచ్చ లేదు. సినిమా ప్రకటనే కాంట్రవర్సీతో మొదలైంది. మధ్యలో ప్రచారాస్త్రంగా పెళ్లి, హనీమూన్ వీడియోలతో భీభత్సం సృష్టించి.. సినిమాపై అంచనాలు మరింత పెంచేలా చేశారు. ఇక ట్రైలర్ చూశాక.. జనానికి అర్థమైంది వారి వ్యక్తిగత జీవితాన్నే వెండితెరపైకి ఎక్కించారని. కానీ వాళ్లెక్కడా చెప్పలేదు. అయితే ఈ సినిమా ఈ నెల 26న విడుదల అయ్యింది. ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో ముందుకు దూసుకెళుతుంది. ఇప్పుడు మరో న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. అదే ఈ సినిమా హీరోయిన్ పవిత్ర లోకేశ్ రెమ్యునరేషన్. ఈ సినిమాకు ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ చూస్తే దిమ్మతిరగాల్సిందే.
పవిత్ర లోకేశ్. తెలుగు వారికి సుపరిచితమైన పేరు. సినిమాలతోనే కాదూ నరేష్‌తో సహజీవనం చేస్తూ వార్తల్లో నిలిచారు. వీరిద్దరూ నటించిన మళ్లీ పెళ్లి థియేటర్లలో సందడి చేస్తోంది. కన్నడ నుండి తెలుగులోకి అడుగుపెట్టిన పవిత్ర.. షూటింగ్ సమయంలోనే నరేష్‌తో ప్రేమలో పడింది. యంగ్ హీరోలకు తల్లి పాత్రలు పోషించి మంచి పెరు తెచ్చుకుంది. మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్‌తో సహజీవనం చేస్తున్నట్లు వార్తలు రావడంతో ఆమెపై ట్రోల్స్ మొదలయ్యాయి. అయినప్పటికీ వాటిని పట్టించుకోవడం లేదు పవిత్ర. సినిమాలు చేసుకుంటూ పోతుంది. విమర్శలకు గురౌతున్నా సినిమా అవకాశాలకు ఏ మాత్రం ఢోకా ఉండటం లేదు. అయితే నరేష్ తో నటించిన మళ్లీ పెళ్లి సినిమాలో.. ఆమె భారీగానే రెమ్యునరేషన్ పుచ్చుకున్నారట.
క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉన్న సమయంలో రోజుకు రూ 60 వేలు రెమ్యునరేషన్ తీసుకునే ఈమె.. ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోయిన్ రెమ్యునరేషన్ కొల్లగొట్టింది.ఈ సినిమా కోసం ఆమె సుమారు రూ. 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుందని టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ. టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్న వారు సైతం ఇంత రెమ్యునరేషన్ తీసుకుని ఉండరు. అయితే ఈ సినిమాకు నరేషే నిర్మాత కావడం విశేషం. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవా అన్నట్లు. ప్రేయసికి ఆ మాత్రం ఇవ్వడంలో సందేహం ఏముందిలే అని గుసగుసలాడుకుంటున్నారు. అందుకే ఆమెకు రూ. 10 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చి ఉంటారని అనుకుంటున్నారు. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది.