యూట్యూబర్ గా మంచి ఫేమ్ సంపాదించుకొని.. బిగ్ బాస్ రియాలిటీ షోలో అడుగుపెట్టాడు షణ్ముఖ్ జస్వంత్. బిగ్ బాస్ లో అడుగుపెట్టాక ఇంకేమైనా ఉందా.. ఏకంగా తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్, సెలబ్రిటీ హోదా సొంతం చేసుకున్నాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెబ్ సిరీస్ లు, కవర్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ నటుడిగా కెరీర్ లో బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడు.
యూట్యూబర్ గా మంచి ఫేమ్ సంపాదించుకొని.. బిగ్ బాస్ రియాలిటీ షోలో అడుగుపెట్టాడు షణ్ముఖ్ జస్వంత్. బిగ్ బాస్ లో అడుగుపెట్టాక ఇంకేమైనా ఉందా.. ఏకంగా తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్, సెలబ్రిటీ హోదా సొంతం చేసుకున్నాడు. అక్కడినుండి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెబ్ సిరీస్ లు, కవర్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ నటుడిగా కెరీర్ లో బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడు. కాగా.. షన్ను డ్యాన్స్, యాక్టింగ్ బాగా చేస్తాడని అందరికీ తెలుసు. పైగా బిగ్ బాస్ కంటెస్టెంట్ దీప్తి సునైనాతో కొన్నాళ్లపాటు లవ్ లో ఉన్నాడని కూడా తెలుసు.
ఇక బిగ్ బాస్ తర్వాత వారిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారు. అప్పటినుండి ఎవరి లైఫ్ వారు చూసుకుంటూ.. వారి వారి కెరీర్ లో బిజీ అయిపోయారు. అయితే.. దీప్తి సింగిల్ అంటూ స్టేటస్ లు పెడుతూ.. అడపాదడపా ప్రైవేట్ ఆల్బమ్స్ లో మెరుస్తోంది. కానీ.. షన్ను మాత్రం జంటగా వేరే అమ్మాయిలతో వెబ్ సిరీస్ లు, సాంగ్స్ చేసేస్తున్నాడు. ఈ క్రమంలో కొంతకాలంగా షన్ను వరుసగా ఒకే అమ్మాయితో ప్రైవేట్ సాంగ్స్ చేస్తున్నాడు. తాజాగా ఆమెతో చేసిన కొత్త సాంగ్ కి సంబంధించి వీడియో కూడా రిలీజ్ అయ్యింది. దీంతో ఆ వీడియో చూసిన వారంతా షన్ను పక్కన ఎవరా అమ్మాయి? రొమాన్స్ లో అలా తేలిపోతున్నారు అంటూ.. ఆ అమ్మాయి గురించి ఆరా తీయడం మొదలు పెట్టేశారు.
షన్ను పక్కన రొమాన్స్ చేస్తున్న అమ్మాయి ఎవరంటే.. ఆమె పేరు ఫణి పూజిత. ఆమె కూడా యూట్యూబ్ వీడియోలలో యాక్ట్ చేసి మంచి ఫేమ్ తెచ్చుకుంది. కానీ.. బయట పెద్దగా తెలియదు. అయితే.. ఒక్కసారిగా షన్నుతో వరుస వీడియోస్ చేస్తూ.. ఏకంగా రొమాంటిక్ వీడియోలో కనిపించేసరికి.. వీరి మ్యాటర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా షన్ను, పూజిత కలిసి ‘అయ్యయ్యో’ అనే ప్రైవేట్ సాంగ్ చేశారు. ఆ వీడియో ప్రెజెంట్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. వీడియోలో షన్ను పూజితను ముద్దాడటం, హగ్ చేసుకోవడం చూసి.. షన్ను కొత్తమ్మాయితో లవ్ లో పడ్డాడా? ఆ రేంజ్ లో రొమాన్స్ పండించేస్తున్నాడు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ.. అదంతా సాంగ్ వరకే అని చెప్పుకొస్తున్నారు షన్ను ఫ్యాన్స్. మరి షన్ను – పూజితల రొమాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.