ఈ ఫొటోలో కనిపిస్తున్న బాబు ఇప్పుడు ఓ పెద్ద సోషల్ మీడియా సెలెబ్రిటీ. ఇతడు ఓ వెబ్ సిరీస్‌తో సూపర్ సక్సెస్‌ను సంపాదించుకున్నాడు. ఎంతలా అంటే అమ్మాయిలు ఇతడి కోసం పడి చచ్చేంతలా..
ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్‌ల హవా విపరీతంగా పెరిగిపోయింది. సినిమాలకంటే ఎక్కువ వెబ్ సిరీస్‌లు చూసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఓటీటీ ఫ్లాట్ ఫాంలతో పాటు యూట్యూబ్‌లో కూడా మంచి మంచి వెబ్ సిరీస్ వస్తున్నాయి. కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్‌కు ప్రజల నుంచి మంచి ఆధరణ వస్తోంది. తద్వారా ఆ వెబ్ సిరీస్‌లో నటించిన వారికి మంచి గుర్తింపు లభిస్తోంది. యూత్‌కు కనెక్ట్ అయ్యే పాయింట్ మీద వచ్చిన అన్ని వెబ్ సిరీస్‌లు సూపర్ సక్సెస్‌ను సాధించాయి. ఎంతలా అంటే.. అందులోని నటీనటులు ఓవర్ నైట్ స్టార్‌లు అయిపోయారు. ఈ ఫొటోలు కనిపిస్తున్న బాబు కూడా ఓ వెబ్ సిరీస్ వల్ల సూపర్ క్రేజ్‌ను సంపాదించుకున్నాడు.
ముఖ్యంగా అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ వచ్చేసింది. ఆ ఫాలోయింగ్‌తో బిగ్‌బాస్‌లో కూడా అడుగు పెట్టాడు. బిగ్‌బాస్‌లో రన్నర్ అప్‌గా నిలిచాడు. ఇప్పటికే ఆ బాబు ఎవరో మీరు గుర్తుపట్టే ఉంటారు. ఆ బాబు ఇంకెవరో కాదు.. ప్రముఖ యూట్యూబ్ స్టార్ షన్ముఖ్ జశ్వంత్. షన్ముఖ్ జశ్వంత్ దాదాపు పదేళ్ల క్రితమే యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించాడు. మొదట్లో షార్ట్ ఫిల్మ్‌లు చేసేవాడు. అప్పటి వరకు రాని గుర్తింపు ‘ సాఫ్ట్‌వేర్ డెవలపర్స్’ అనే వెబ్ సిరీస్‌తో వచ్చింది. ఈ వెబ్ సిరీస్ యూట్యూబ్‌లో ఓ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ట్రాజిడీ లవ్ స్టోరీ కావటంతో యువత వెబ్ సిరీస్‌కు బ్రహ్మరథం పట్టారు.
దీంతో షన్ముఖ్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ‘‘ సూర్య’ వెబ్ సిరీస్ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తర్వాత ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాంలో ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ అనే వెబ్ సిరీస్ తీశాడు. సోషల్ మీడియాలో తనకున్న సూపర్ ఫాలోయింగ్ కారణంగా ‘బిగ్ బాస్ తెలుగు 5’లోకి ఎంట్రీ ఇచ్చాడు. రన్నర్ అప్‌గా నిలిచాడు. మరి, షన్ముఖ్ జశ్వంత్ చిన్ననాటి ఫొటోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.