జూనియర్ ఎన్టీఆర్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాల నటుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరో రేంజ్ కీ ఎదిగాడు. నేడు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న తారక్.. మొదట చాలా తక్కువ తీసుకున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇది ఒక పేరు కాదు, బ్రాండ్. ఆయన పేరు చెప్తే .. అభిమానుల్లో పూనకాలు వస్తాయి. నందమూరి వారసుడిగా చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టి తారక్.. ప్రత్యేక స్టార్ డమ్ ని సొంతం చేసుకున్నాడు. బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. 13 ఏళ్లకి ‘బాల రామాయణం’లో రాముడిగా అద్భుతంగా నటించి..తొలిసారి నంది అవార్డు అందుకున్నారు. నేడు వంద కోట్ల రేంజ్ లో ఉన్న తారక్ తొలి సినిమాకు రెమ్యూనరేషన్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.
బాల నటుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరో రేంజ్ కీ ఎదిగాడు. తొలుత ‘నిన్ను చూడాలని’ సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా ద్వారా ఆశించిన ఫలితం దక్కకపోయినా నటుడిగా ఎన్టీఆర్ కు మాత్రం మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తరువాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నం.1 సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ మారిపోయింది. ఆ సినిమా ఇచ్చిన హిట్ కిక్కుతో ఇక ఎన్టీఆర్ వెను తిరిగి చూసుకోలేదు.
ఆ తరువాత వచ్చిన ఆది, సింహాద్రి, యమదొంగ, అదుర్స్, బృందానం సహా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తారక్ ఖాతాల వేసుకున్నాడు. ఇక ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ నిలిచింది. ఎన్నో కష్టాలు పడి ప్రస్తుతం స్టార్ హీరోగా ఎదిగిన తారక్ కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఎన్ని కోట్లు తీసుకున్నా తన మొదటి సినిమాకు వచ్చిన పారితోషికాన్ని తన జీవితంలో మరిచిపోలేడట. మొదటిసారిగా జూనియర్ ఎన్టీఆర్ కు నాలుగు లక్షల పారితోషికం వచ్చిందట.
అంత మొత్తంలో డబ్బు చూసి ఏం చేయాలో తెలియక చాలా రోజులు వరకు ఆ డబ్బును లెక్క పెడుతూ కూర్చున్నాడట. చివరకు ఆ డబ్బులు తారక్.. తన తల్లి కి ఇచ్చాడంట. ఆన్ స్కీన్ అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా తన టాలెంట్ తో సెపరేటు ఫ్యాన్ బేస్ ని తారక్ సొంతం చేసుకున్నాడు. నటుడిగా , సింగర్ గా, డ్యాన్సర్ గా, యాంకర్ ఇలా తనకు తానే సాటి అనింపిచుకున్నారు. నేడు తారక్ పుట్టిన రోజు సందర్భంగా మీ విషెష్ ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.