‘బిగ్ బాస్ 5 తెలుగు’ ప్రతి ఎపిసోడ్, ప్రతి ప్రోమో మాములుగా ఉండటం లేదు. మన్‌డే అంటే ఫన్‌డే అంటున్నారు నెటిజన్లు. నామినేషన్ అనగానే హౌస్‌లో వాతావరణం అంతా వేడెక్కుతుంది. ఒక్కొక్కరు చెప్పే కారణాలు, చేసే నామినేషన్ కొన్ని సిల్లీగా ఉంటాయి. ఈసారి మాత్రం అందరూ ఫుల్ టెంపర్‌గా కనిపిస్తున్నారు. నువ్వెంతంటే నువ్వెంత అంటూ సవాళ్లు విసురుతున్నారు. ఈ వారం నామినేషన్ ప్రక్రియ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది.
సెంటర్ ఆఫ్ కాంట్రవర్సీగా నటి ఉమాదేవి మారుతోంది. దుర్భాషలాడుతూ కనిపించిన ఉమాదేవి. నామినేట్ చేసే సమయంలో కూడా సవాళ్లు విసిరింది. దమ్మున్న వాళ్లు తనతో నేరుగా ఆడాలంటూ కోరారు. యానీ మాస్టర్, ప్రియాంక సింగ్‌తో ఉమా వివాదాలు ఇంకా ముదురుతున్నాయి. రావే, పోవే అనే స్థాయికి చేరాయంటే శనివారం, ఆదివారం దాకా ఆగకుండా కింగ్ నాగార్జున మధ్యలోనే పంచాయితీకి రావాల్సి వస్తుందోమో అంటున్నారు. ఈ ప్రోమో చూసిన వాళ్లు అందరూ ఎపిసోడ్ కోసం ఉవిళ్లూరుతున్నారు. భయం అనగానే యానీ మాస్టర్ బాగానే రియాక్ట్ అయ్యారు. ఈ మధ్య యానీమాస్టర్ యాంగ్రీ సైడ్ బాగా కనిపిస్తోంది.
ఆర్జే కాజల్, విశ్వ వివాదం కూడా బాగానే ముదురుతోంది. ఆర్జే కాజల్ కిచెన్ నుంచి తప్పించుకున్న సందర్భాన్ని ప్రస్తావిస్తూ అందరూ కలిసి చేస్తేనే అన్నీ పనులు చక్కగా అవుతాయంటూ హితవు పలికాడు. అందుకు కాజల్ గట్టిగానే రెస్పాండ్ అయ్యింది. షణ్ముఖ్ కూడా ఉమాదేవి గురించి మాట్లాడాడు. మాట్లాడటం కాదు.. ఈ హౌస్ ఉమాదేవి కరెక్టు కాదని చెప్పేశాడు. యాంకర్ రవి కూడా అసలు ఆట మొదలు పెట్టినట్లు కనిపిస్తోంది. సింగర్ శ్రీరామ చంద్రను నామినేట్ చేస్తూ అతని మెచ్యూరిటీ అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. అంటే వారికి ప్రవర్తన పరంగా ఏదో జరుగుతోందనే ప్రశ్నలు వస్తున్నాయి.