బిగ్ బాస్ హౌస్‌లో ఆదివారం అంటే ఫన్ డే కాదు.. సోమవారం కోసమే ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే వారం మొత్తం దాచుకున్న అక్కసు, కోపం అన్నీ నామినేషన్స్ లో బయట పెడతారు కాబట్టి. ఆ అసలు సిసలైన భావాలను చూసేందుకు ఎదురుచూస్తూ ఉంటారు. ఈ వారం నామినేషన్స్ లిస్ట్ పెద్దగానే ఉంది. నాలుగో వారం నామినేషన్స్ లో మొత్తం 10 మంది ఉన్నారు. వారిలో చాలా రిపీటెడ్ పేర్లే ఉన్నాయి. వాళ్లు ఎవరంటే.. సింగర్ రేవంత్, ఇనయా సుల్తానా, సూర్యా, శ్రీహాన్, గీతూ రాయల్, సుదీపా, రాజ్, ఆరోహీ నామినేట్ అయ్యారు. ఇంక బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి హోస్ట్ నాగార్జున కీర్తీ భట్, అర్జున్ కల్యాణ్‌లను నేరుగా నామినేట్ చేశాడు. వారితో కలిపి ఈ వారం నామినేటెడ్ లిస్ట్ 10కి చేరింది.
ఈసారి నామినేషన్స్ లోనూ ఇనయా సుల్తానా, శ్రీహాన్ మధ్య గొడవ జరిగింది. నిజానికి అది ఇప్పుడు కాదు చాలా రోజులుగా జరుగుతూనే ఉంది. ఇనయా కొన్నిసార్లు కావాలనే శ్రీహాన్‌తో గొడవ పెట్టుకుంది. మూడోవారం కెప్టెన్సీ పోటీదారుల టాస్కులో శ్రీహాన్ బ్రిక్ పట్టుకోవడం చూశానంటూ గొడవ పెట్టుకుంది. అప్పుడు శ్రీహాన్ పిట్ట అనడంతో నానా యాగి చేసింది. ఆ గొడవను హోస్ట్ నాగార్జున వచ్చి పరిష్కారం చేయాల్సి వచ్చింది. అటు శ్రీహాన్‌కి కూడా క్లాస్ పీకాడు అలా ఎలా అంటావ్ అని. ఇటు ఇనయాకి కూడా అన్నీ బాగుంటే ఏమన్నా నడిచిపోయిద్ది అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఆ గొడవ అక్కడితో అయిపోయింది అనుకున్నారు అంతా కానీ, మళ్లీ నామినేషన్స్ లో అందుకు సంబంధించే గొడవ జరిగింది.
పాత గొడవలతో పాటుగా ఇనయా సుల్తానా ఈసారి కొత్త గొడవను తెరమీదకు తెచ్చింది. నాగార్జునతో మట్లాడే సమయంలో వాడు అని ఎందుకు అందో చెప్పుకొచ్చింది. అందరం సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్లమే కాబట్టి వాడు అన్నాను అని చెప్పగా.. ఆ సమయంలో శ్రీహాన్ నేను నీకంటే చిన్న అంటూ సెటైర్ వేశాడు. ఇప్పుడు నామినేషన్స్ లో ఆ విషయాన్ని ప్రస్తావించింది. “నేను చూడటానికి, బాడీ పరంగా పెద్దగా ఉండచ్చు. కానీ, నువ్వు నన్ను ఏజ్‌లో పెద్ద అని ఎలా అంటావ్? నేను పెద్ద దాన్ని అని ఎలా అంటావ్?” అంటూ ఇనయా సుల్తానా చెప్పుకొచ్చింది. అయితే శ్రీహాన్ ఆమె మాటలకు నోరెళ్లబెట్టాడు. నేను ఈ మాటలు అన్నీ అన్నానా? అంటూ ప్రశ్నించాడు. అయితే మరోసారి ఇనయా పాయింట్ కాకుండా అన్నీ మాట్లాడుతుందని నిరూపించుకుంది. శ్రీహాన్- ఇనయా గొడవపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.