బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 హౌస్‌లో గ్రూపులు, టీమ్‌లు ఉన్నాయన్న విషయం ఓపెన్ సీక్రెట్. ఎవరికి నచ్చిన వారితో వాళ్లు మాట్లాడుకుంటారు. కొందరు మాత్రం గోడమీద పిల్లిలా అన్ని జట్లను చుట్టేస్తూ ఉంటారు. ఈ సీజన్లో ఇప్పటివరకు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అనే లిస్ట్ లో సింగర్ రేవంత్- చలాకీ చంటి కచ్చితంగా ఉంటారు. ఈ ఇద్దరూ సీజన్ మొదలైన కొద్దిరోజుల వరకు చాలా క్లోజ్‌గా కనిపించారు. రేవంత్ అన్నా అన్నా అనుకుంటూ వెనకే తిరిగేవాడు. ఏ విషయం ఉన్నా చంటి అన్నా అని షేర్ చేసుకుంటూ ఉండేవాడు. కానీ, తర్వాత వారి మధ్య గ్యాప్ వచ్చింది. వారి రిలేషన్ దెబ్బతింది అని అందరికీ అర్థమైపోయింది. ముఖ్యంగా నామినేషన్స్ లో చంటి ఏదో కారణం చెప్పి రేవంత్‌ని నామినేట్ చేస్తూనే ఉంటాడు.
అంతేకాదు.. నేను అలా చేస్తూనే ఉంటానంటూ ఓ సందర్భంలో ఓపెన్‌గానే చెప్పాడు. అయితే వారి మధ్య ఎందుకు చెడింది అనేది మాత్రం చాలా మందికి తెలియని విషయం. చంటి రేవంత్‌ని దూరం పెట్టడానికి పెద్దగా కారణాలు ఏమీ లేవు. నేను చెప్తే వినడా? అనే ఒక చిన్న ఇగో క్లాష్ తోనే దూరం పెడుతున్నట్లు కనిపిస్తోంది. మొదటివారంలో సింగర్ రేవంత్ ఫుల్ నెగెటివ్ అయ్యాడు. అలాంటి సమయంలో నువ్వు నోరు కంట్రోల్ చేసుకో, ఇలా బిహేవ్ చేయు అంటూ చంటి చెప్పుకొచ్చాడు. రేవంత్ ఆ మాటలను విన్నట్లే విని పక్కన పెట్టేశాడు. ఆ తర్వాత చంటికి క్లోజ్‌గా ఉండే వారితో గొడవలు జరగడంతో పూర్తిగా దూరం పెట్టేశాడు. పైకి అన్నా, తమ్ముడు అంటూ మాట్లాడుకున్నా లోపల మాత్రం ఇద్దరికీ ఒకరిపై ఒకరికి మంచి అభిప్రాయం లేదు.
ఇంక తాజాగా వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున ఒక గేమ్ ఆడించాడు. ఇంట్లో ఉన్నవారికి జంతువుల పేర్లు పెట్టాలి. అది కూడా ఎందుకు పెట్టారో చెప్పాలి. గీతూ రాయల్- నేహాకి ఊసరవెల్లి అని పెట్టింది. ఆ తర్వాత నేహా- గీతూ ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అనే తరహాలో మళ్లీ గీతూకి ఊసరవెల్లి అని పెట్టింది. బాలాదిత్య- ఆదిరెడ్డికి ఏనుగు అని పెట్టాడు. అయితే చలాకీ చంటి గాడిద అనే బోర్డు తీసుకుని రేవంత్‌కి వేశాడు. ఎందుకో వేశాడో చెప్తూ.. “గాడిదలా పని చేస్తాడు. కానీ, ఒక పద్ధతి ఉండదు” అంటూ చెప్పాడు. గాడిదలా పనిచేస్తాడు అంటే కితాబు కింద పరిగణించవచ్చు. కానీ, చేసే పనికి పద్ధతి ఉండదు అనేసరికి పూర్తి నెగెటివ్ కోణంలో అన్నాడని అర్థమైంది. అయితే ఎందుకు చంటి ఇలా టైమ్ దొరికిన ప్రతిసారి అక్కసు తీర్చుకుంటున్నాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. చలాకీ చంటి- రేవంత్‌ని గాడిద అనడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.