బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. మూడు వారాలు పూర్తి చేసుకుని నాలుగోవారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు హౌస్‌లో జరిగిన వాటిలో ఇంట్రస్టింగ్ విషయాలు ఏమైనా ఉన్నాయి అంటే.. రెండోవారం డబుల్ ఎలిమినేషన్, రాజ్ కెప్టెన్ కావడం అనుకున్నారు. అయితే మూడోవారం నేహా చౌదరిని పంపేయడం అంతకన్నా పెద్ద ట్విస్ట్ అంటూ చెబుతున్నారు. ఎందుకంటే నేహా చౌదరి కన్నా గేమ్ ఆడకుండా హౌస్‌లో ఉన్న వాళ్లు చాలా మంది ఉన్నారనేది ప్రేక్షకులు, ఫ్యాన్స్ అభిప్రాయం. అందుకే ఆమె ఎలిమినేషన్ వార్తను ఆకలింపు చేసుకోలేకపోతున్నారు. ఇంక కెప్టెన్‌గా ఆదిరెడ్డి తన బెస్ట్ ఇచ్చేందుకు శ్రాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. కామన్ మ్యాన్ కెప్టెన్ అయితే ఎలా ఉంటుందో చూపించాలని కృషి చేస్తున్నాడు.
బిగ్ బాస్ ప్రేక్షకులకు వీకెండ్ ఎపిసోడ్ కన్నా కూడా.. సోమవారం అంటేనే ఎంతో ఇష్టం. ఎందుకంటే సోమవారం అనగానే ఆ రోజు నామినేషన్స్ ఉంటాయి. నామినేషన్స్ అంటే హౌస్‌లో మొత్తం రచ్చ రచ్చ జరుగుతుంది. వారం మొత్తం ఎక్కడ దొరుకుతారా అని పాయింట్లు రాసి పెట్టుకునే హౌస్‌మేట్స్.. సోమవారం మొత్తం కక్కేస్తారు. ఎవరు ఏ రోజు ఎలా హర్ట్ చేశారు అనేది మనసులో దాచుకుని అందరి ముందు ఏకరువు పెడతారు. నువ్వు ఆ రోజు నన్ను ఆ మాట అన్నావ్.. నేను తీసుకోలేకపోయాను అంటూ చెబుతారు. అందుకు ఎదుటి వాళ్లు అప్పుడే చెప్పచ్చు కదా అంటారు. అలా చెప్తే నామినేట్ ఎలా చేస్తారు చెప్పండి.
ఇంక నాలుగో వారం నామినేషన్స్ లిస్టు కూడా వచ్చేసింది. ఈసారి కూడా హౌస్‌లో నామినేషన్స్ ఫుల్ హీట్ రేపాయనే చెప్పాలి. ఈసారి బిగ్ బాస్ టమాటా నామినేషన్స్ పెట్టాడు. ఎవరైతే హౌస్ లో నుంచి బయటకు పోవాలి అని అనుకుంటూ ఉంటారో.. వారి నెత్తిన టమాటా పిండాలి. ఈ వారం కూడా ఎప్పటిలాగానే అవే పేర్లు రిపీట్ అయ్యాయి. లిస్ట్ లో పెద్దగా కొత్తదనం కనిపించలేదు. అసలు ఎవరెవరు నామినేషన్స్ లో ఉన్నారంటే.. సింగర్ రేవంత్, ఇనయా సుల్తానా, గీతూ రాయల్, సుదీపా, రాజ్, ఆరోహీ, సూర్యా, శ్రీహాన్ నామినేషన్స్ లోకి వచ్చారు. ఇంక బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి హోస్ట్ నాగార్జున ఇద్దరు సభ్యులను నేరుగా నామినేట్ చేశాడు. వాళ్లే కీర్తీ భట్, అర్జున్ కల్యాణ్.. వీళ్లతో కలిపి మొత్తం సంఖ్య 10కి చేరింది. నాలుగో వారం హౌస్‌లో మొత్తం 10 మంది నామినేషన్స్ లో ఉన్నారు. ఈ నామినేషన్స్ లిస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.