బిగ్ బాస్ 6వ సీజన్ లో కాస్తోకూస్తో ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చే పర్సన్ గీతూనే. ఎందుకంటే హౌసులోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి వాగుతూ అందరి అటెన్షన్ గ్రాబ్ చేస్తూనే ఉంది. మరోవైపు ఈసారి హౌసులోకి గేమ్ ఆడేందుకు వచ్చినవారి కంటే.. ఎంజాయ్ చేసేందుకు వచ్చిన వారే ఎక్కువ. ఒకరిద్దరు తప్పించి మిగతా బ్యాచ్ అంతా తిన్నమా.. కూర్చున్నామా అన్నట్లుగా ఉన్నారు. ఇక ఇప్పటికే గేమ్ మొదలుపెట్టనివారు.. గతవారం నాగార్జున పీకిన క్లాస్ దెబ్బకు అలర్ట్ అయిపోయారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తొలి రెండువారాలతో పోలిస్తే మూడోవారం బిగ్ బాస్ హౌసులో కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. కెప్టెన్సీ కోసం ‘అడవిలో ఆట’ గేమ్ పెట్టారు. ఇందులో ఎవరికి వారు.. గెలిచేందుకు తెగ ప్రయత్నాలు చేశారు. అడ్డదారులు కూడా ఉపయోగించారు. ఈ క్రమంలోనే గొడవలు, తిట్టుకోవడాలు, దెబ్బలు తగలడం.. ఇలా చాలా జరిగాయి. ఇక ఫైనల్ గా ‘ఎత్తర జెండా’ టాస్కులో పోటీపడిన శ్రీహాన్, శ్రీసత్య, ఆదిరెడ్డిలలో.. ఫస్ట్ దీన్ని పూర్తిచేసిన ఆదిరెడ్డి కెప్టెన్ కూడా అయిపోయాడు.
ఇక సండే ఎపిసోడ్ కూడా వచ్చేసింది. ఎలిమినేషన్ టెన్షన్ ఉన్నాసరే.. హౌస్ మేట్స్ తో సండేని ఫండేగా మార్చి హోస్ట్ నాగార్జున, ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ జనరేట్ చేశాడు. ‘సుత్తిదెబ్బ’ ఆట పెట్టాడు. హౌసులో ఎవరు ఫేక్ అని నాగ్ అడగ్గా.. ఫైమా, ఆరోహి తలపై సుత్తితో కొట్టింది. ఆరోహి ఫేక్ ఉంటే.. హౌసులో మాకు అన్ని ఫొటోలు దొరుకుతాయా అని నాగ్ పంచ్ వేశాడు. నోటిదూల ఎవరికి ఎక్కువ అని నాగ్ అడగ్గా.. ఆదిరెడ్డి, గీతూ నెత్తిపై సుత్తితో కొట్టాడు. ఈ విషయం కరెక్టా కాదా అని ఆడియెన్స్ ని అడగ్గా.. వాళ్లందరూ కూడా యస్ బోర్డులు చూపించారు. ఓ అబ్బాయి మాత్రం నో పెట్టాడు. ఎందుకు నో పెట్టావ్ అని అతడిని అడగ్గా.. గీతూ ఏది మాట్లాడిన రైట్ మాట్లాడుతారు. అనగానే గీతూ విజిల్ వేసి ఎంకరేజ్ చేసింది. మరి దొబ్బేయ్ అనడం ఓకేనా అని నాగ్ అడగ్గా.. అతడు నవ్వేశాడు. ఈ మొత్తం తతంగంతో.. హౌస్ట్ నాగార్జున అందరి ముందే గీతూ పరువు తీసినంత పనిచేశాడు.
ఇక ఆ తర్వాత ఓవర్ డ్రమాటిక్ అని నేహా నెత్తిపై రేవంత్ కొట్టగా, ఈ విషయాన్ని ఫన్నీ చేసేశాడు హోస్ట్ నాగార్జున. హౌసులో లూజర్ ఎవరు అని గీతూని అడగ్గా, రేవంత్ నెత్తిపై సుత్తితో కొట్టింది. కానీ ఆడియెన్స్ మాత్రం నో బోర్డులు ఎత్తి మరీ దాన్ని రాంగ్ అని ప్రూవ్ చేశారు. తిండిబోతు శ్రీసత్యనే అని ఆడియెన్స్ కన్ఫర్మ్ చేసేశారు. ఇక పాట ప్లే చేయగానే అందరూ డ్యాన్స్ చేశారు. కానీ నెక్స్ట్ పాట ప్లే చేసినప్పుడు కెప్టెన్ ఆదిరెడ్డి మాత్రమే డ్యాన్స్ చేయమని నాగ్ ఆర్డర్ వేశాడు. ఆ సమయంలో స్టెప్పులు వేయలేక ఆదిరెడ్డి తెగ ఇబ్బంది పడ్డాడు. దీంతో అందరూ తెగ నవ్వుకున్నారు. మరి నాగ్, గీతు నోటిదూలపై కౌంటర్ వేయడం గురించి మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: ప్రతి ప్రోమో-ఎపిసోడ్లో గీతూపైనే ఫోకస్.. ఆమె తప్ప ఎవరూ ఆడటం లేదా?