బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. మూడు వారాలు పూర్తి చేసుకుంది. హౌస్‌లో కొత్త కెప్టెన్ ఆదిరెడ్డి తన మార్క్ చూపించేందుకు కృషి చేస్తున్నాడు. ఇంక హౌస్ నుంచి ఇప్పటికే ముగ్గురు సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం నో ఎలిమినేషన్ వీక్ కాగా.. రెండోవారంలో మాత్రం షానీ, అభినయశ్రీలను ఎలిమినేట్ చేశారు. ఇక మూడోవారం ఎవరూ ఊహించని విధంగా నేహా చౌదరి ఎలిమినేట్ అయ్యింది. చాలామందికి ఈ ఎలిమినేషన్ కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. నిజానికి మొదట ఇనయా సుల్తానా ఎలిమినేట్ అవుతందని భావించారు. కానీ, ఆర్జీవీ చేసిన ఒక్క ట్వీట్‌తో ఓటింగ్ లెక్కలు మారిపోయాయి. ఇనయా సేఫ్ జోన్‌కి వెళ్లి డేంజర్ జోన్‌లో ఉన్న నేహా చౌదరి బయటకు వచ్చింది.
అయితే నేహా చౌదరి ఎలిమినేషన్‌ను ఆమె మాత్రమే కాదు.. హౌస్ మేట్స్ కూడా నమ్మలేకపోయారు. వాసంతి, ఆరోహీ లాంటి వాళ్లు ఏం ఆడుతున్నారంటూ నేహా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అయితే ఇంట్లో నుంచి బయటకు రావడం కూడా నేహా చాలా కోపంతో వచ్చేసింది. ఎవరికీ సరిగ్గా గుడ్‌బై కూడా చెప్పలేదు. నాకు కోపంగా ఉంది అంటూ బయటకు వెళ్లిపోయింది. స్టేజ్ మీదకు వచ్చాక కూడా ఆ కోపాన్ని ప్రదర్శచింది. బిగ్ బాస్‌లో తన జర్నీ వీడియో చూసి నేహా భావోద్వేగానికి గురైంది. అయితే నేహాకి నాగార్జున దమ్ము, దుమ్ము అని ఒక గేమ్ ఇచ్చాడు. హౌస్‌లో ఉన్న వారిలో ఎవరు దమ్మున్న ఆటగాళ్లు, ఎవరు దుమ్ము అని నువ్వు అనుకుంటున్నావో చెప్పు అంటూ టాస్క్ ఇచ్చారు.
ముందు దుమ్ము కేటగిరీలో ఆరుగురిని పెట్టింది. ఇనయ, రేవంత్, ఆరోహీ, గీతూ, అర్జున్ కల్యాణ్, వాసంతి.. వీళ్లంతా హౌస్‌లో రియల్‌గా ఉండటం లేదని నేహా చౌదరి ఆరోపించింది. ఆట ఆడి గెలవాలి అనే పద్ధతి ఉంటుంది, నిజంగా ఆడి గెలవాలి అనే పద్ధతి ఉంటుంది, ఎలాగైనా గెలవాలి.. నేను బ్యాడ్ అయినా పర్లేదు అనే పద్ధతి ఉంటుంది. వీళ్లంతా జెన్యూన్‌గా లేరు అనిపిస్తోంది. నిజానికి నేను రేవంత్ వల్లే ఇక్కడ ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. అంతా సాట్ అవుట్ చేసుకున్నాక కూడా రేవంత్ నామినేట్ చేసి మళ్లీ అవే మాటలు చెప్పుకొచ్చాడు అంటూ నేహా విమర్శించింది. ఇంకి దమ్ము కేటగిరీలో చంటి, సుదీపా, బాలాదిత్య, శ్రీహాన్, ఆదిరెడ్డి, శ్రీ సత్య, రాజ్ ఫొటోలను ఉంచింది. రాజ్ గురించి చెబుతూ నేహా ఏడ్చేసింది. రాజ్ చాలా మంచి ఫ్రెండ్ అయ్యాడని, బయటకు వచ్చినా కూడా తనకి బాడీగార్డ్ గా ఉంటానంటూ చెప్పుకొచ్చింది. నేహా చౌదరి ఎలిమినేషన్ కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.