బిగ్ బాస్ హౌస్ అంటేనే గొడవలు, లవ్ ట్రాకులు, అలకలు, కోపాలు.. ఇలా చాలా ఎమోషన్స్ ఉంటాయి. అవేం లేకుండా ఇంట్లో ఉండిపోతాను అనుకుంటే కుదరదు. బిగ్ బాస్ ఎలిమినేట్ చేసేస్తాడు. సో వీలైనంతగా డ్రామా పండించాలి. ఈసారి తొలి రెండు వారాలు జోడీలేం సెట్ కాలేదు. మూడో వారం వచ్చేసరికి పూర్తిగా సీనే మారిపోయింది. తాను ఎవరితో కలవను అంటూనే శ్రీసత్య, అర్జున్ కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నట్లు అనిపిస్తుంది. మరోవైపు ఆర్జే సూర్య-ఆరోహి కూడా కెమిస్ట్రీ పండిస్తూ అలరిస్తున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. అర్జున్ కల్యాణ్, గత కొన్నిరోజుల నుంచి శ్రీసత్య దగ్గర తెగ పులిహోర కలుపుతున్నాడు. మనోడు జైలులో ఉన్న సమయంలో.. శ్రీసత్య అతడి దగ్గర కూర్చుని తన పర్సనల్ ప్రాబ్లమ్స్ ని షేర్ చేసుకుని బాధపడింది. ఆ సమయంలో అడ్వాంటేజ్ తీసుకున్న అర్జున్.. ఊరుకో ఊరుకో అన్నట్లు ఆమెపై చేయి వేశాడు. జస్ట్ అలా టచ్ చేసినందుకే.. శ్రీసత్య పెద్ద డ్రామా చేసింది. నాపై చేయి వేయకు, చేయి వేయకుండా మాట్లాడు అని తెగ ఫైర్ అయిపోయింది. నేను జస్ట్ ఇలానే అన్నాను కదా అని అర్జున్ అంటే.. చికాకులో ఉన్నప్పుడు నన్ను ముట్టుకుంటే ఇంకా చిరాకొస్తుందని శ్రీసత్య తెగ ఫీలైపోయింది.
ఈ గొడవని ఇక్కడితే ఆపేస్తే అయిపోతుంది కదా.. అలా కాకుండా అర్జున్ తనపై చేయి వేశాడని, రేవంత్ దగ్గర చెప్పి అతడిపై అరిచేశానని తెగ బిల్డప్ ఇచ్చినట్లు కనిపించింది. తనని ఎవరైనా అన్నిసార్లు ముట్టుకుంటే నచ్చదని ఓవరాక్షన్ చేసినట్లు అనిపించింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్న శ్రీసత్యని అర్జున్ జస్ట్ అలా టచ్ చేశాడు. దానికే శ్రీసత్య ఫైర్ కావడంపై నెటిజన్స్ తలో రకంగా స్పందిస్తున్నారు. అసలు మీ ఇద్దరి మధ్య ఏముందిరా బాబు అని మాట్లాడుకుంటున్నారు. అర్జున్ టచ్ చేశాడని శ్రీసత్య చేసిన హడావుడిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: చివరి నిమిషంలో ట్విస్ట్.. ఎలిమినేట్ అయిన నేహా చౌదరి!