బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ప్రస్తుతం హౌస్‌లో వాతావరణం అంతా వేడిగా సాగుతోంది. సోమవారం నామినేషన్స్ లో ఫైమా తప్ప అందరూ ఉన్నారు. హౌస్‌లో ఉన్న రేవంత్, ఇనయా సుల్తానా, శ్రీహాన్, శ్రీసత్య, రాజ్, రోహిత్, మెరీనా, ఆదిరెడ్డి, కీర్తీ భట్ నామినేషన్స్ లో ఉన్నారు. అయితే ఈసారి బిగ్ బాస్ నామినేషన్స్ లో ఉన్న సభ్యులకు ఓ అవకాశం కల్పించారు. ఎవరైతే ఎక్కువ అమౌట్ కోట్ చేస్తారో వారిని నామినేషన్స్ నుంచి సేవ్ చేస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చారు. అయితే వాళ్లు కోట్ చేసిన అమౌంట్‌ని విన్నర్ ప్రైజ్ మనీ నుంచి తగ్గిస్తామని చెప్పుకొచ్చారు. ఈ ప్రక్రియలో రాజ్ విజయం సాధించి ఈవారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడని తెలుస్తోంది.
అయితే నామినేషన్స్ కు సంబంధించి గత వారం బాలాదిత్య, వాసంతిలను ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ షాకిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈవారం కూడా అదే నిర్ణయానికి వచ్చాడని.. మరో బ్యూటీని ఇంటికి పంపేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. అయితే ఆ బ్యూటీ మరెవరో కాదు.. శ్రీసత్య. అవును మీరు చదివింది కరెక్టే. ఈ వారం శ్రీసత్యను బిగ్ బాస్ బ్యాగ్ సర్దుకోమని చెప్పబోతున్నట్లు లీకులు వస్తున్నాయి. అనధికారిక ఓటింగ్లలో కూడా శ్రీసత్య తక్కువ ఓట్లలో అట్టడుగున కొనసాగుతోంది. నిజానికి శ్రీసత్య ఎక్కువ అమౌంట్‌నే కోట్ చేసింది. ఆమే నామినేషన్స్ నుంచి సేవ్ కావాల్సి ఉంది. కానీ, ఆమె ఆ విషయాన్ని మరొకరితో డిస్కస్ చేసింది. బిగ్ బాస్ రూల్స్ ని మీరినందుకు డిస్కాలిఫై చేశారు.
బంగారంలాంటి అవకాశాన్ని చేతులారా నాశనం చేసుకుందని అభిమానులు బాధ పడుతున్నారు. అయితే శ్రీసత్యకు గత రెండు వారాలుగా ఫుల్ నెగిటివిటీ వస్తున్న విషయం తెలిసిందే. ఆమె చెప్పే మాటలు.. చేసే పనులకు అస్సలు సంబంధం ఉండటం లేదు. ఎదుటివారికి నీతులు చెప్పి ఆమె మాత్రం ఇష్టారీతిన బిహేచ్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శ్రీహాన్ తరహాలో ఆమె కూడా హౌస్ మేట్స్ ని వెటకారం చేస్తోందని ఆరోపిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీసత్య స్ట్రాంగ్ ప్లేయరే కావొచ్చు.. కానీ, ఆమె స్వయంకృతాపరాధాలతో ఎలిమినేషన్ పరిస్థితి తెచ్చుకున్నట్లు చెబుతున్నారు. ఎప్పుడెప్పుడు ఆమె నామినేషన్స్ లోకి వస్తుందా అని బిగ్ బాస్ ప్రేక్షకులు సైతం ఎదురుచూస్తున్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ వారం మాత్రం శ్రీసత్యకు గుడ్ బై చెప్పబోతున్నారని గట్టిగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.