బిగ్ బాస్ తెలుగు సీజన్ 6కి కాస్త ఆదరణ పెరిగినట్లుగానే కనిపిస్తోంది. సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న సందర్భంలో మరోసారి ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిందంటున్నారు. ఈవారం ఎలిమినేషన్స్ లో మోడల్ రాజశేఖర్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. నిజానికి ఫైమా ఎలిమినేట్ కావాల్సింది. కానీ, ఆమె తన దగ్గర ఉన్న ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ని వినియోగించుకుంది. అందువల్ల ఫైమా ఎలిమినేట్ కావాల్సి ఉండగా.. ఆమె స్థానంలో రాజ్ ఎలిమినేట్ అయ్యాడు. 12 వారాలు తర్వాత రాజ్ హౌస్ నుంచి బయటకు వచ్చాడు. హౌస్‌లో కాంట్రవర్సీ, నెగెటివిటీ లేకుండా బయటకు వచ్చిన చాలా కొద్దిమందిలో రాజ్ కూడా ఒకడు.
ఇంక ప్రేక్షకులు సండే కంటే.. మండే అంటేనే ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే సోమవారం రోజు బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్స్ ఉంటాయి కాబట్టి. ఆ సమయంలో ఇంటి సభ్యులు అంతా ఒక ట్రాన్స్ లోకి వెళ్లిపోతారు. ఆరు రోజులు ఎంతో అన్యోన్యంగా, కలిసి మెలిసి కనిపించే వాళ్లు ఆ రోజు మాత్రం తెగ కొట్టేసుకుంటారు. ఇంక ఇంట్లోని సభ్యులు తగ్గుతున్న కొద్దీ ఆ రచ్చ ఇంకా పెరుగుతుంది. అలాగే ఈ వారం కూడా నామినేషన్స్ లో చాలా పెద్ద గొడవలే జరిగాయి. ముఖ్యంగా ఆదిరెడ్డి- రేవంత్, ఆదిరెడ్డి- శ్రీహాన్ మధ్య చాలా పెద్ద వాగ్వాదం జరిగింది. ఆదిరెడ్డి అయితే ఇక్కడ ఎవడూ భయపడడు అంటూ చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యాడు.
ఆదిరెడ్డి- రేవంత్ మధ్య కొన్ని వారాలుగా పరోక్ష యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఫిజికల్ టాస్కులు రాగానే ఇద్దరూ శత్రువులు అయిపోతారు. అలాగే గతంలో జరిగిన ఒక టాస్కు వల్ల వీళ్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. రేవంత్ స్ట్రాటజీని ఆదిరెడ్డి ప్రశ్నించాడు. అందుకు రేవంత్ నన్ను కావాలనే బ్యాడ్ చేస్తున్నావంటూ చెబితే వీడియో చూపిస్తే వెళ్లిపోతా అంటూ ఆదిరెడ్డి ఛాలెంజ్ చేశాడు. ఆ వీడియో చూపించారు.. నాగ్ అతనిపై సీరియస్ కూడా అయ్యాడు. అయితే ఇప్పుడు నామినేషన్స్ లో మళ్లీ అదే వాదన వచ్చింది. ఆ వీడియోకి ముందు జరిగినది వాళ్లు చూపించలేదు.. అది చూపిస్తే తెలుస్తుంది. అయినా నీ మనస్సాక్షికి తెలియదా అంటూ ప్రశ్నిస్తాడు. అందుకు రేవంత్ నాకు చూపించిన వీడియోకి సంబంధించే స్టాండ్ తీసుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు.
ఆ సందర్భంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. నామినేషన్ వేసి వెళ్లిపో అనగానే ఎక్కడికి వెళ్లేది? నీకు వినాలని లేకపోతే లోపలికి వెళ్లి సోఫాలో కూర్చో అంటూ ఆదిరెడ్డి కౌంటర్ ఇచ్చాడు. ఇక్కడ ఎవడూ భయపడడు అంటూ రేవంత్‌పై ఆదిరెడ్డి రెచ్చిపోయాడు. అలాగే శ్రీహాన్ విషయంలో కూడా ఆదిరెడ్డి సీరియస్ కామెంట్స్ చేశాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం ఆదిరెడ్డి రూ.లక్ష రాయగా.. ఆ అమౌంట్ ఎక్కువ అని శ్రీహాన్- ఆదిరెడ్డితో అన్నాడు. అందుకు ఆదిరెడ్డి.. బ్రో రూ.లక్షన్నర రాసిన నువ్వు లక్ష రాసిన వాడిని కాస్త తక్కువ అమౌంట్ రాసుండాల్సింది అనడం చాలా సిల్లీగా ఉంది అంటూ సీరియస్ అవుతాడు. అందులో ఎదవా అనే పదాలు కూడా వాడుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది. ఈ ఫుల్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తున్నారు.