బిగ్ బాస్ హౌస్ మొత్తం ఫుల్ ఫైర్ మీదున్న విషయం తెలిసిందే. నామినేషన్స్ హీట్ ఇంకా తగ్గలేదు. అంతా ఒకరిపై ఒకరు కేకలు వేసుకుని నానా రచ్చ చేశారు. అయితే బాగా టార్గెట్ అయ్యింది. అందరూ సూర్య ఎలిమినేట్ కావడానికి కారణం నువ్వే అంటూ ఇనయా సుల్తానాని నామినేట్ చేశారు. కాసేపు అతను అంటే ఇష్టం అంటావ్.. మరికాసేపు అతినితో కలిసుంటే బ్యాడ్‌గా బయటకు వెళ్తుందని గొడవ పడతావు. మళ్లీ చేతి మీద నెయిల్ పాలిష్‌తో S అని రాసుకుంటావ్ అంటూ అంతా కామెంట్ చేశారు. సూర్య వెళ్లినప్పుడు అంత ఏడ్చావ్.. నామినేట్ చేస్తే వెళ్లిపోతాడని తెలియదా? వెళ్లిపోవడానికి నామినేట్ చేసి మళ్లీ వెళ్లిపోయాక డ్రామాలు ప్లే చేస్తున్నావ్ అంటూ ఇంటి సభ్యులు ఇనయా సుల్తానాని టార్గెట్ చేశారు.
సూర్య ఇష్టం అంటూనే వెనుక రేవంత్‌తో అతను వెళ్లిపోతాడంటూ కామెంట్ చేసిన వాటిని కూడా బయటపెట్టారు. మరోవైపు ఫైమాకి ఇనయాకి కూడా గట్టిగానే వివాదం జరిగింది. ఇదే నీ నిజ స్వరూపం అంటూ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. మొత్తానికి హౌస్ మొత్తం ఒకవైపు ఇనయా సుల్తానా ఒకవైపు అన్నట్లు పరిస్థితి మారిపోయింది. ఎవరిని కదిలించినా ఇనయా గురించే మాట్లాడు కోవడం మొదలు పెట్టారు. అవన్నీ విని సూర్యా తనవల్లే వెళ్లిపోయాడనే ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత ఆమె మెంటల్‌గా బాగా డిస్టర్బ్ అయ్యింది. ఒక్కతే బెడ్‌రూమ్‌లో ఉన్న బాత్‌రూమ్‌లోకి వెళ్లి తలుపు లాక్ చేసుకుని కూర్చొంది. ఆమె కోసం ఇంటి సభ్యులు అంతా వెతికారు.
చివరకు ఆమె ఆ బాత్ రూమ్‌లో ఉన్నట్లు తెలుసుకుని.. బయటకు రావాల్సిందిగా బతిమిలాడారు. ఆమె ఒక్కతే లోపల కూర్చొని ఏడవడం చూసి కాసేపు అంతా భయపడిపోయారు. లోపల ఆమె ఏమైనా అఘాయిత్యం చేసుకుంటుందేమో అనే భయం వారందరిలో కనిపించింది. అందరూ ఇనయా సుల్తానాకు ధైర్యం చెప్పి బయటకు తీసుకువచ్చేందుకు నానా ప్రయత్నాలు చేశారు. నిన్ను ఎవరూ ఏమీ అనరు అంటూ హామీ ఇచ్చారు. గీతూ అయితే విన్నర్ అవుతా అన్నావు.. ఇలా బాత్ రూమ్‌లో కూర్చొని ఏడుస్తావ్ ఏంటి అంటూ చెప్పుకొచ్చింది. ఆమె ఎంతకీ బయటకు రాకపోవడంతో రేవంత్ డోర్ బద్దలు కొడతానంటూ చెప్పుకొచ్చాడు. కెప్టెన్ పర్మిషన్ ఇస్తే డోర్ పగలగొట్టి ఆమెను బయటకు తీసుకొస్తానంటూ తెలిపాడు.