బిగ్ బాస్ తెలుగు సీజన్ 6కి కాస్త క్రేజ్ పెరిగింది. ఫ్యామిలీ ఎపిసోడ్ సందర్భంగా ప్రేక్షకుల ఆదరణ కాస్త పెరిగిందని చెబుతున్నారు. కుటుంబసభ్యులు రావడంతో అంతా ఎమోషనల్‌గా మారిపోయింది. అయితే ఇప్పుడు ఈ వారానికి సంబంధించిన అప్‌డేట్స్ గురించి చూస్తే.. ఇనయా సుల్తానా లక్ మారిపోయింది. సీజన్ మొత్తం కెప్టెన్ కావాలని ఎన్నో ప్రయత్నాలు, పోరాటాలు చేసింది. కానీ, కాలేకపోయింది. ఈసారి కెప్టెన్ అయ్యే వారికి ఇంకో ఆఫర్ కూడా ఇచ్చారు. అదేంటంటే.. ఈ వారం ఎవరైతే కెప్టెన్ అవుతారో వారు నేరుగా సెమీ ఫైనల్ వీక్‌కి వెళ్లిపోతారు. అంటే ఫైనల్‌కి ఒక్క అడుగుదూరం మాత్రమే అనమాట. ఇప్పుడు ఇనయా సుల్తానా ఆ అడుగు దూరానికి వెళ్లిపోయింది. అవును.. లాస్ట్ వీక్ కెప్టెన్‌గా ఇనయా గెలిచింది.
ఇంక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని కూడా అంతా ఎదురుచూశారు. అయితే ఈ వారం కూడా షాకింగ్ ఎలిమినేషన్ ఉంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనే దానికి సంబంధించి ఒక పేరు లీక్ అయ్యింది. రోహిత్ ఈవారం ఎలిమినేట్ అయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నిజానికి రోహిత్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్. భార్యాభర్తలు ఇద్దరూ నామినేషన్స్ లోఉన్నా కూడా రోహిత్‌కు మంచి ఓట్లు పడేవి. ఇప్పుడు అతని భార్య మెరీనా కూడా లోపల లేదు. ఆమె అభిమానులు కూడా రోహిత్‌కే ఓట్లు వేస్తారు. కానీ, రోహిత్ ఎలిమినేట్ అయ్యాడు అనే వార్త అభిమానులు, ప్రేక్షకులను కాస్త కలవర పెడుతోంది. ఎందుకంటే మొదటి నుంచి రోహిత్‌కి బయట పెద్దగా ఫాలోయింగ్ లేకపోయినా కూడా.. అతని గేమ్, త్యాగాలతో ప్రేక్షకుల మన్ననలు పొందాడు.
అలాంటిది ఇప్పుడు రోహిత్ ఎలిమినేషన్ అనగానే అంతా షాకవుతున్నారు. అందుకు కొందరైతే రీజన్లు కూడా చెబుతున్నారు. నిజానికి రోహిత్ ఎలిమినేట్ కావాల్సింది కాదు. కానీ, వేరే వాల్ల గ్రాఫ్ మారడం వల్ల రోహిత్ ఎలిమినేట్ కాక తప్పడం లేదుఅంటున్నారు. అంటే నిజానికి శ్రీసత్య గత వారం నుంచి లీస్ట్ పొజిషన్‌లో ఉంది. కానీ, ఫ్యామిలీ వీక్ ద్వారా ఆమె గ్రాఫ్ అమాంతం పెరిగింపోయింది. ఆమె తల్లిదండ్రులను, వారి కష్టాలను చూసి ప్రేక్షకులు కరిగి పోయారు. ఇంక ఆమె తర్వాత ఫైమా లీస్ట్ లో ఉంది. అయితే ఫైమా దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది. పైగా వాళ్ల అమ్మ ఆమెను చూసేందుకు వచ్చిన సమయంలో నీ ఆట బయట ప్రేక్షకులకు అంత నచ్చడం లేదు. నీ దగ్గరున్న ఫ్రీ పాస్ వినియోగించుకో అని కూడా హింట్ ఇచ్చింది. కాబట్టి వీళ్లు ఇద్దరి వల్ల రోహిత్ ఎలిమినేట్ కాక తప్పడం లేదని చెబుతున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.