సిరి.. బిగ్ బాస్-5 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్.అయితే.., ఈమె స్టాటజీలు పక్క వారిని టార్గెట్ చేసే విధంగా ఉంటాయన్న కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. హౌస్ నుండి బయటకి వెళ్ళాక సరయు కూడా.. సిరి, షణ్ముఖ్ నాటకాలు ఆడుతున్నారంటూ సీరియస్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అప్పుడు సరయు చెప్పినట్టే.. సిరి నాటకం ఒకటి ఇప్పుడు అడ్డంగా బయట పడింది. ఆ నాటకాన్ని బయట పెట్టింది కూడా నాగార్జన కావడం విశేషం.
టాస్క్‌లో భాగంగా సన్నీ తన షర్ట్లోకి చేయి పెట్టాడంటూ గోల గోల చేసి, అందరి ముందు సన్నీని దోషిగా నిలబెట్టింది సిరి. ఈమె ఆరోపణలకి షణ్ముఖ్ సాక్ష్యం చెప్పి వత్తాసు పలికాడు. దీంతో.., హౌస్ మేట్స్ కూడా సన్నీనే నిందుతుడిగా చూశారు. ఆడపిల్ల షర్ట్‌లో చేయిపెట్టడం ఏంటని సన్నీని అందరూ ఆడిపోసుకున్నారు. కానీ.., వీకెండ్ లో హోస్ట్ గా వచ్చిన నాగార్జున సిరి నాటకాన్ని బయట పెట్టేశారు.
సిరి.. నువ్వు హౌస్ లో అన్నీ కరెక్ట్ గానే చేస్తున్నావా? సన్నీ నీ షర్ట్‌లో చేయి పెట్టడం నిజమేనా అని సూటిగా అడిగారు నాగార్జున. “నేను రైట్ చేస్తున్నా. సన్నీ నా షర్ట్ లోపల చేయి పెట్టి తీశాడు’ అని సమాధానం చెప్పింది సిరి. దీనికి శ్వేతాని సాక్ష్యంగా చెప్పింది. కానీ.., శ్వేత మాత్రం చేయి పెట్టింది తాను చూడలేదని జెన్యూన్ గా సమాధానం ఇచ్చింది. కానీ.., ఇక్కడ కూడా షణ్ముఖ్ సిరికి మద్దతుగా, సన్నీకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు. దీంతో.. హౌస్ లో సన్నీ దోషిగా మిగిలిపోయాడు. తాను ఏ తప్పు చేయలేదని మొత్తుకున్నాడు. సరిగ్గా.. ఈ సమయంలో నాగార్జున రంగంలోకి దిగారు.
సర్లే ఈ గొడవ అంతా ఎందుకు ఓసారి వీడియో చూద్దాం అంటూ అప్పటి వీడియోను మళ్ళీ ప్లే చేసి చూపించారు నాగార్జున. ఆ వీడియోలో సన్నీ.. సిరి షర్ట్ లోపలికి చేయిపెట్టలేదని.. క్లియర్‌గా కనిపించింది. దీంతో సిరి బండారం బయట పడింది. అడ్డంగా బుక్ అయిపోవడంతో వీడియో చూసిన వెంటనే ప్లేట్ మార్చేసింది.
ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది సార్.. క్లారిటీ రాకపోయినా.. నేను ఈ విషయాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. లైట్ గా తీసుకున్నా అంటూ కవర్ చేసే ప్రయత్నం చేసింది. దీంతో.., నాగార్జున సిరికి గట్టిగానే క్లాస్ పీకాడు. “ఒక వ్యక్తి క్యారెక్టర్ పై నిందలు వేసి, ఇప్పుడు అడ్డంగా దొరికిపోయాక పోనీలే అంటే ఎలా? స్ట్రాటజీలు ఉంటే తప్పు లేదు. కానీ.., అవతల వాళ్ళని తప్పుగా ప్రోజెక్ట్ చేయకు” అంటూ సిరిపై నాగార్జున సీరియస్ అయ్యాడు. ఇదే ఫ్లోలో తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు షణ్ముఖ్ కి కూడా వార్నింగ్ ఇచ్చాడు. తనపై పడ్డ మచ్చని పోగొట్టినందుకు సన్నీ చేతులు జోడించి నాగార్జునకి థాంక్స్ చెప్పడం విశేషం. మరి.. ఈ మొత్తం వ్యవహారంలో సిరి చేసిన రచ్చపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.