ఈ సన్ డే ‘బిగ్ బాస్ హౌస్’లో మోస్ట్ ట్రాజెడీ డేగా మారిపోయిందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ సీజన్‌లో మాత్రం ప్రేక్షకులు ఏదీ తలచినా అది జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఈ వారం హౌస్ నుంచి ఇంకో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయి పోయారు. ఈ సారి ఈ ఎలిమినేషన్ ప్రేక్షకులకే కాదు.. ఇంట్లోని వారికి కూడా నచ్చలేదనే చెప్పాలి. మోస్ట్ ఎమోషనల్ ఎలిమినేషన్ జరిగిపోయింది. ఈ వారం నామినేషన్స్‌లో సన్నీ, లోబో, మానస్, హమీదా, ప్రియ, జెస్సీ, షణ్ముఖ్, రవి, విశ్వ ఉన్నారు. అప్పుడు లహరి షేరీ ఎలిమినేషన్ అప్పుడు ఎలా అయితే అవాక్కయ్యారో.. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఈ వారం హౌస్ నుంచి హమీదాని ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్. అంతే ఒక్కసారి అందరూ షాక్. బుల్లితెర ప్రేక్షకులు అస్సలు ఊహించని ఎలిమినేషన్ ఇది. ఇప్పుడు అందరూ అయ్యో శ్రీరామచంద్ర అంటున్నారు.
‘బిగ్ బాస్ హౌస్’లో శ్రీరామచంద్ర, హమీదా అంటే ఒక రేంజ్ ఏర్పడింది. పని ఐదైనా ఇద్దరూ కలిసి క్యూట్‌గా చేసుకుంటూ ఉండేవారు. వారి మధ్య ఒక మ్యాజిక్‌ని క్రియేట్ చేశాడు బిగ్ బాస్. ఇప్పుడు ఇలా సడెన్‌గా ఆ ట్రాక్‌ని కట్ చేసే సరికి అందరు భావోద్వేగానికి లోనయ్యారు. హమీదా వెళ్లిపోతే శ్రీరామచంద్ర ఎలా ఉంటాడు అన్నదే అభిమానుల్లో తలెత్తిన ప్రశ్న.
ఇదీ చదవండి: అక్టోబరు 13న మార్కెట్ లోకి వన్ ప్లస్ 9RT.. కంప్లీట్ స్పెసిఫికేషన్స్.. ప్రైస్ డీటైల్స్!
హోస్ట్ నాగార్జున అడిగిన ఒక ప్రశ్నకు సింగర్ శ్రీరామచంద్ర చెప్పిన ఆన్సర్ కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. నీకు హమీదా ముఖ్యమా? బిగ్ బాస్ టైటిల్ ముఖ్యమా అని అడిగిన ప్రశ్నకు కాసేపు ఆలోచించి మరీ శ్రీరామ్ టైటిల్ కోసం వచ్చాను.. నాకు టైటిలే ముఖ్యం అన్నాడు. ఒకవేళ హమీదా ఎలిమినేట్ అవుతుందని తెలిసే నాగార్జున ఈ ప్రశ్న అడిగి ఉంటాడని టాక్ మొదలైంది. శ్రీరామచంద్ర హమీదా ఇంపార్ట్‌టెంట్ అంటే మరి ఎలిమినేషన్ రౌండ్‌లో ఏమైనా మార్పు ఉండేదా? అనే ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. కొండపొలం డైరెక్టర్ క్రిష్ కూడా శ్రీరామచంద్రతో అదే అన్నాడు. నన్ను ఆ ప్రశ్న అడిగితే నేను హమీదా ముఖ్యమని చెప్పేవాడిని అని.
హౌస్‌లో కొందరికి శ్రీరామచంద్ర- హమీదా పెయిర్ అంటే కొంత జెలసీ కూడా ఉంది. మొన్న గిఫ్ట్ హ్యాంపర్స్ కోసం సెలక్ట్ చేసిన నలుగురిలో హమీదా కూడా ఉండటాన్ని హౌస్ మేట్స్ ప్రశ్నించారు కూడా. నీ సెలక్షన్‌లో పార్షియాలిటీ కనిపిచింది అని కామెంట్ చేశారు. ఏ పనైనా వీళ్లు కలిసి చేయడాన్ని కూడా ఆక్షేపించేవారు. ఎప్పుడూ శ్రీరామచంద్ర హమీదాతోనే ఉంటాడు హౌస్‌లో ఇంకా ఎవరినీ పట్టించుకోడు అంటూ కామెంట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మరి ఇప్పటికైనా శ్రీరామచంద్ర గేమ్‌పై కాన్సన్‌ట్రేట్ చేస్తాడులే అంటూ సెటైర్‌లు వేస్తున్నారు.