బిగ్ బాస్ 5వ సీజన్ తో కొందరి జీవితాలు తారుమారు అయిపోయాయి. లవ్ లో ఉన్న జంటల మధ్య బిగ్ బాస్ పెంట పెట్టిందని.. అందుకే హౌజ్ నుండి బయటికి రాగానే బ్రేకప్స్ జరిగాయని కామెంట్స్ వినిపించాయి. అయితే.. బిగ్ బాస్ తర్వాత బ్రేకప్ అయిన పాపులర్ జంట షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునైనాలదే. ఈ జాబితాలో సిరి హన్మంత్, శ్రీహాన్ పేర్లు కూడా వినిపించాయి కానీ, అలాంటి విభేదాలు ఏమి లేవని వారు తేల్చేశారు.బిగ్ బాస్ ముగిసాక షణ్ముఖ్ పేరు వినిపించినంతగా ఎవరిదీ వినిపించలేదు. అందుకు కారణం దీప్తితో బ్రేకప్. వారిద్దరూ బ్రేకప్ అయితే చెప్పుకున్నారు. కానీ అందుకు కారణం ఏంటనేది ఇంతవరకు బయటికి రాలేదు. కానీ బిగ్ బాస్ ముగిసిన టైం నుండి షణ్ముఖ్, దీప్తిల మధ్య విభేదాలకు కారణం సిరినే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. వారిద్దరూ విడిపోవడానికి సిరి కూడా ఓ కారణంగా నిలిచిందని అభిప్రాయాలు వెలువడ్డాయి.
ఓవైపు షణ్ముక్ ‘మై లవ్ ఈజ్ గాన్’ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో బ్రేకప్ పోస్టులు, టీవీ షోలో డాన్స్ చేస్తూ గడిపేస్తున్నాడు. అయితే తమ బ్రేకప్ కు కారణం సిరి కాదని, అందుకు వేరే కారణాలు ఉన్నాయంటూ ఇటీవల స్పందించాడు షణ్ముఖ్. వాలంటైన్స్ డే సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ.. ‘మా ఇద్దరి బ్రేకప్ కి కారణం సిరి కాదు. సిరి, దీప్తి గుడ్ ఫ్రెండ్స్. మేం విడిపోవడానికి చాలా కారణాలున్నాయి. నా వల్ల దీప్తి ఎంతో నెగిటివిటీని ఫేస్ చేసింది.సోషల్ మీడియాలో నన్ను ట్రోల్ చేసినా తాను సపోర్ట్ చేసింది. అయితే.. సిరితో చనువుగా ఉండడం అనేది ఫ్యాన్స్ తో పాటు దీప్తి ఫ్యామిలీకి కూడా నచ్చలేదు. దీంతో తన ఫ్యామిలీ నుండి దీప్తికి ఒత్తిడి పెరిగింది. ఇకనైన తను సంతోషంగా ఉండాలనే ఉద్ధేశంతోనే బ్రేకప్ చెప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం మేమిద్దరం మా కెరీర్ పై దృష్టి పెట్టాం. మేము మళ్లీ కలుస్తామా? లేదా? అనేది దేవుడికే వదిలేశాం. ఏది జరగాలో అదే జరుగుతుందని నమ్ముతున్నాను. మా బ్రేకప్ గురించి సిరిని నిందించడం సరైనది కాదు. తప్పు నాదే అందుకు నన్ను నిందించాలి’ అంటూ బ్రేకప్ విషయం పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు షణ్ముఖ్.
ఇంకా మాట్లాడుతూ.. ‘నాలాంటి మూడీ పర్సన్ కి బిగ్ బాస్ కరెక్ట్ కాదు. నేను ఇతరులతో తక్కువగా మాట్లాడతాను. షో నుంచి బయటకు వచ్చాక నాపై ఎంత నెగిటివిటీ ఏర్పడిందో తెలిసింది. నేను 27 ఏళ్ళ వయసులోనే ఎన్నో ఎదురు దెబ్బలు చూశాను. ఇక లైఫ్ లో ఎలా ముందుకెళ్లాలి అని నేర్చుకుంటున్నాను. హౌజ్ లో సిరికి నేను సపోర్ట్ చేశాను. కానీ సిరి వాళ్లమ్మ మా ఇద్దరినీ తప్పుగా అర్థం చేసుకోవడం బాధించింది’ అని షణ్ముఖ్ చెప్పుకొచ్చాడు. మరి షణ్ముఖ్, దీప్తి ల బ్రేకప్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.