Hamida: బాస్ షో ద్వారా పాపులర్ అయిన బ్యూటీలు ఎంతోమంది ఉన్నారు. ఆ షో ద్వారా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. కానీ.. సినీ ఇండస్ట్రీలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోతున్నారు. బిగ్ బాస్ లో అంత ఫ్యాన్ ఉన్నా సినిమాల్లో అవకాశాలు రాకవపోవడంతో.. మోడలింగ్ చేస్తూ లేదా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 5, బిగ్ బాస్ నాన్ స్టాప్ ద్వారా పాపులర్ అయిన బ్యూటీలలో హమీదా ఖాతూన్ ఒకరు. బెంగాలీకి చెందిన ఈ 29 ఏళ్ళ భామ.. తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగులో సినిమాలి చేసింది. కానీ అనుకున్న స్థాయిలో ఆమెకు గుర్తింపు రాలేదు. 2013లో సినిమా మీద ఇంటరెస్ట్ తో హైదరాబాద్ కు వచ్చింది. అలా వచ్చి అవకాశాల కోసం ట్రై చేస్తూ.. 2015లో ‘సాహసం చేయరా డింభకా’ అనే సినిమాతో వెండి తెరపై ఎంట్రీ ఇచ్చింది.
అనంతరం భద్రం బీకేర్ ఫుల్ బ్రదర్ సినిమాలో కూడా నటించింది. ఈ రెండు సినిమాలూ హిట్ అవ్వలేదు.. హమీదాకు గుర్తింపు కూడా తీసుకురాలేదు. ఇక టాలెంట్, అందం ఉన్నా తనకు ఛాన్సులు బిగ్ బాస్ షోలో అడుగుపెట్టింది. హౌస్ మేట్ గా ఫ్యాన్స్ లో క్రేజ్ తెచ్చుకుంది. అయితే.. హమీదా ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఇంటీరియర్ డిజైనర్ అయినటువంటి హమీదా.. ప్రస్తుతం సినీ కెరీర్ పైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ లో హోస్ట్ నాగార్జున చేత ప్రశంసలు అందుకున్న హమీదా.. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తోంది. అయితే.. బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉన్నప్పటికీ, హమీదా బయటికి వచ్చాక మాత్రం అందాలను ఆరబోసే విషయంలో ఏమాత్రం తగ్గట్లేదు. తాజాగా ఈ భామ బీచ్ లో సారీ కట్టుకొని చేసిన గ్లామర్ షో నెట్టింట సెగలు రేపుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న హమీదా సారీ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.