దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులు అర్పించి, వైయస్సార్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సతీమని జయమ్మతో సహా ఏపీ సీఎం జగన్, వైయస్ షర్మిల ఒకే చోట కనిపించారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన కూతురు షర్మిల తనయుడు రాజారెడ్డి స్పెషల్ గా కనిపించారు. తల్లి, చెల్లితో కలిసి రాజారెడ్డి వైఎస్సార్ ఘాట్‌లో తాతకు నివాళి అర్పించారు. ప్రతి చోట తల్లి వెంటనే సాగుతూ కనిపించాడు. రాజారెడ్డి కి సంబంధించిన ఫోటోలు వైఎస్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల తెలంగాణలో వైయస్ షర్మిల ‘వైయస్సార్ తెలంగాణ పార్టీ ’ పెట్టిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి జగన్ కి ఆమెకు మద్య గ్యాప్ ఏర్పడిందని వార్తలు వచ్చాయి. ఆనాటి నుంచి విజయమ్మ కూతురికి సపోర్ట్ గా ఉంటున్నారు.
ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్‌లో జరిగిన కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని తన పిల్లలతో హైదరాబాద్ చేరుకున్నారు షర్మిల. ఆ తర్వాత పంజాగుట్టలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. షర్మిల వెంట ఆమె తనయుడు రాజారెడ్డి కనిపించడంతో అభిమానుల్లో మంచి ఉత్సాహం కనిపించింది. రాజారెడ్డిని చూసేందుకు అభిమానులు ఆసక్తి కనబరిచారు. ఈ సందర్బంగా తన తండ్రి ఆశయాల కోసం తాను పోరాటం చేస్తున్నానని.. తన తండ్రి దీవెనులు ఎప్పుడూ ఉంటాయని షర్మిల ఉద్వేగభరితమైన పోస్ట్ పెట్టారు.
ఎండలో నీడగా, వానలో జల్లులా, చీకటిలో వెలుగులా, పగటి పూట ఆలోచనగా,కష్టాల్లో అండగా,
నా పోరులో ఆయుధంగా,నాకు స్ఫూర్తినిస్తూ నన్ను నడిపిస్తున్న నాన్నా.. మీరు చూపిన ప్రేమ, మీరిచ్చిన ధైర్యం, నాలో మిమ్మల్ని చూస్తున్న జనం.. అనుక్షణం మిమ్మల్ని గుర్తుచేస్తూనే ఉంటాయి.#HappyBirthDayDad #YSR73 pic.twitter.com/un641aKiYm— YS Sharmila (@realyssharmila) July 8, 2022