ప్రముఖ టీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే సుమ అడ్డా అనే కార్యక్రమం లో పిచ్చి పీక్ కి వెళ్లిందని అందరు అనుకుంటున్నారు.. తాజాగా సుమ అడ్డా కార్యక్రమంలో శనివారం నాడు ప్రసారం కాబోయే ప్రోగ్రాంకి సంబంధించిన ఒక ప్రోమోని విడుదల చెయ్యడం జరిగింది.
ప్రముఖ టీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే సుమ అడ్డా అనే కార్యక్రమం లో పిచ్చి పీక్ కి వెళ్లిందని అందరు అనుకుంటున్నారు.. తాజాగా సుమ అడ్డా కార్యక్రమంలో శనివారం నాడు ప్రసారం కాబోయే ప్రోగ్రాంకి సంబంధించిన ఒక ప్రోమోని విడుదల చెయ్యడం జరిగింది. ఆ ప్రోమోలో దివంగత నేత, ప్రతి తెలుగువాడి గుండెల్లో నేటికీ కొలువుతీరి ఉన్న మహా నేత, సమైక్య ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా చేసిన డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కూతురు అయిన వై ఎస్ షర్మిల గారిని విమర్శించడం జరిగిందని వైఎస్ఆర్ అభిమానులతో పాటు సాధారణ ప్రజలు కూడా అంటున్నారు.
తాజాగా విడుదలైన ప్రోమో లో సుమ ఒక యాక్టర్ ని స్కూల్ లో విద్యార్థులకి సంబందించిన పాయింట్ అడుగుతుంటే అదిరే అభి అనే ఒక కామెడీ యాక్టర్ అసలు విద్యార్థులని విద్యార్థులు అని ఎందుకంటారో తెలుసా అని అనటం వెంటనే అదిరే అభి పక్కనే ఉన్న ఒక లేడీ ఎందుకంటే వాళ్లు విద్యార్థులు కాబట్టి అని అనటం జరిగింది. వెంటనే సుమ తో సహా అందరు నవ్వుతారు.. ఆ ప్రోమోను చూసిన మేము చాలా బాధపడుతున్నామని రాజశేఖర్ రెడ్డి అభిమానులు, షర్మిల అభిమానులు అంటున్నారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేలా షర్మిల అనేక ప్రజా సమస్యల మీద అలుపెరుగని పోరాటం చేస్తూ ఊపిరి కూడా సలపలేని విధంగా ప్రజలు మంచి కోసం ఆలోచిస్తూ అనుకోకుండా ఒకే మాటని రెండు సార్లు ఉదాహరణగా చెప్పటం జరిగింది.
యాదృచ్చికంగా షర్మిల పలికిన మాటల్ని సుమ అడ్డా షో లో కామెడీ గ చెయ్యడం సుమ లాంటి సీనియర్ కళాకారిణి కూడా ఆ మాటలకి నవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని వై ఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు ,షర్మిల అభిమానులు అంటున్నారు.. ఒక మహా నేత కూతురు.. ఇంకో మహా నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు.. సొంతం గ పార్టీ పెట్టి ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్న ఒక గొప్ప నాయకురాలు అయిన షర్మిల మీద ఇలాంటి జోకులు ప్రసారం కాకుండా చూడాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు.