ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన గొప్ప ముఖ్యమంత్రుల్లో ఒకరు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన అత్యంత ప్రజాదరణ పొందిన నేత. ఆయన హయాంలో చేసిన సేవలను ఎప్పటికీ గుర్తుకుపెట్టుకుంటారు ప్రజలు. ఆ తర్వాత ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని వచ్చారు పిల్లలు షర్మిల, జగన్ మోహన్ రెడ్డిలు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులు అర్పించి, వైయస్సార్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సతీమని జయమ్మతో సహా ఏపీ సీఎం జగన్, వైయస్ షర్మిల ఒకే చోట కనిపించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన కూతురు షర్మిల తనయుడు రాజారెడ్డి స్పెషల్ గా కనిపించారు. […]