ఆంధప్రదేశ్‌లో మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికల కోసం సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. టీడీపీకి కీలంగా ఉన్న విజయవాడ ఈస్ట్ వైసీపీ అభ్యర్థిగా.. దేవినేని అవినాశ్‌ను ప్రకటించారు. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గ వైసీపీ నేతల సమావేశం సందర్భంగా జగన్ ఈ ప్రకటన చేశారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.. ‘‘2024 ఎన్నికల్లో నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయాలి. వచ్చే ఎన్నికల్లో అవినాశ్‌కి అందరూ సహకరించాలి. ఎన్నికలను ప్రతి ఒక్కరూ సీరియస్‌గా తీసుకోవాలి. మనలో మనకు ఎలాంటి విభేదాలున్నా పక్కనబెట్టి.. ముందు పార్టీ గెలుపు కోసం కృషి చేయాలి. సమస్యలని మనం తర్వాత పరిష్కరించుకుందాం. అవినాశ్‌ను గెలిపించే బాధ్యత మనందరిది’’ అంటూ నేతలకు దిశా నిర్దేశం చేశారు సీఎం జగన్.
కాగా.. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన స్థానాలపై జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టార్గెట్ 175 దిశగా వ్యూహా రచన చేస్తున్న జగన్.. దీనిలో భాగంగా బుధవారం విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలు, నేతలతో సమావేశమయ్యారు. గతంలో 2014, 2019 ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్ నుంచి రెండుసార్లు టీడీపీనే విజయం సాధించింది. దీంతో ఈసారి అక్కడ ఖచ్చితంగా గెలిచి తీరాలని నేతలు, కార్యకర్తలకు జగన్ దిశా నిర్దేశం చేశారు.