గోదావరి నీరైనా, వర్షం నీరైనా, వరద నీరైనా చేరాల్సింది ఆ సముద్రంలోకే. ఎంత పెద్ద సముద్రమైనా అప్పుడే భారీగా చేరిన నీరు పూర్తిగా తనలో కలుపుకోవాలంటే సమయం పడుతుంది. గత కొన్ని రోజుల నుండి విపరీతంగా కురుస్తున్న వర్షాలకు నదులు ఉదృతంగా ప్రవహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వరద నీరంతా రోడ్లపై చేరి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది. కొన్ని చోట్ల ఈ వరద నీరు గోదావరి నదిలో కలిసే ప్రయత్నం చేసినా.. మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఇప్పుడు వర్షాలు తగ్గడంతో వరద నీరు తిరిగి నదుల్లో కలుస్తుంది, అక్కడి నుంచి సముద్రాల్లో కలుస్తుంది. అలా కలిసినప్పుడు మాత్రం ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉంటుందో. కాకినాడ జిల్లా ఉప్పాడలో అలాంటి అద్భుత దృశ్యం ఒకటి కనువిందు చేస్తోంది.
నీలం రంగులో ఉండే ఉప్పాడ సముద్ర తీరంలోకి.. వరద నీరు చేరడంతో రెండు వేర్వేరు రంగులు పక్కపక్కనే కనువిందు చేస్తున్నాయి. కాఫీ, నీలి రంగులతో సముద్రం అందంగా కనబడుతోంది. ఏదో రెండు రంగులు యుద్ధం చేసుకుంటే ఎలా ఉంటుందో అలా.. నీలో సంగమిస్తానని వరద నీరు అంటుంటే.. నేను ఆల్రెడీ కమిటెడ్ అని సముద్రం అంటున్నట్టు చూడ ముచ్చటగా ఉంది. కాగా ఈ వరద నీరు సముద్ర జలాలతో పూర్తిగా కలిసిపోయేందుకు.. వారం నుంచి 10 రోజుల సమయం పడుతుందని మత్స్యకారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సుందరమైన ఉప్పాడ సముద్ర తీరం మాత్రం పర్యాటకులను ఆకర్షిస్తోంది. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వరద నీటితో సాగర సంగమంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Getup Srinu: ఏడుకొండలు ఆరోపణలపై నోరు విప్పిన గెటప్ శీను.. బిల్డప్ బాబయ్ అంటూ కౌంటర్!
ఇది కూడా చదవండి: Oscars 2023: ఆస్కార్ బరిలో RRR.. ఈ సారి అవార్డు ఖాయం అంటున్న సినీ విశ్లేషకులు..