ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా వర్షాల కారణంగా ప్రాజెక్టుల్లో వరద నీటి ఉధృతి పెరిగిపోతుంది. మూసీ నదిలోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
తెలంగాణలో వర్షం బీభత్సం సృష్టిస్తుంది. భారీ వర్షాల కారణంగా వాగులు పొంగుతున్నాయి. వరద ఉధృతికి తెలంగాణలోని పలు గ్రామాలు నీట మునుగుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మోరంచపల్లి గ్రామం మొత్తం మునిగిపోయింది. ఆరడుగుల ఎత్తుకి వరద నీరు చేరడంతో ఇళ్ళు, భవనాలు మునిగిపోయాయి. భయంతో ప్రజలు చెట్లు, బిల్డింగుల పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటున్నారు. చాలా మంది మిస్ అయినట్లు చెబుతున్నారు. ఇక హైదరాబాద్ లోని ఉస్మాన్ సాగర్ (గండిపేట), హిమాయత్ సాగర్ జంట జలాశయాలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో గండిపేట 2 గేట్లు, హిమాయత్ సాగర్ 6 గేట్లను తెరిచారు.
ఈ కారణంగా మూసీ నదిలోకి భారీగా వరద నీరు చేరుతుంది. మూసీ నది వద్ద మూసారాంబాగ్ వంతెన కింద నీటి మట్టం పెరిగిపోతుంది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. శివాలిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌటుప్పల్ మండలం సంఘం గ్రామం వద్ద ఉన్న మూసీ నది పొంగిపొర్లుతుందని.. జనాలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని రాచకొండ పోలీస్ సూచించారు. ఇదిలా ఉంటే మూసీ నదిలోకి భారీగా వరద నీరు వస్తుండడంతో మూసీ నది సమీపంలో ఉంటున్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మూసీని ఆనుకుని ఉన్న ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
పురానాపూల్, కిషన్ బాగ్, జియాగూడ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారులు, విపత్తు నిర్వహణ బృందాలు, పోలీసులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. నల్గొండ జిల్లా కేతపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టు నీటిని 7 గేట్ల ద్వారా దిగువకు అధికారులు విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు ఉండగా.. ప్రస్తుత సామర్థ్యం 642.50 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ 4.46 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.81 టీఎంసీలుగా ఉంది. మూసీ ప్రాజెక్ట్ లోకి ఇన్ఫ్లో 17,250 క్యూసెక్కులు వస్తుండగా.. 17,250 క్యూసెక్కుల అవుట్ ఫ్లో విడుదల చేస్తున్నారు.
Water level increasing in the #MusiRiver at #MoosarambaghBridge, after 2 flood gates of #HimayatSagar and 2 flood gates of #OsmanSagar (#Gandipet) have been lifted, @insptr_malakpet continuously monitoring the water level.#HyderabadRains #HYDERABAD #TelanganaRains #HeavyRains pic.twitter.com/ydrTWBubUL
— Surya Reddy (@jsuryareddy) July 27, 2023
#MusiRiver at Sangem village, Choutuppal(M) under @SiValigonda Police station is overflowing, Citizens are advised to use alternative routes.@TelanganaCOPs @DcpBhongir @AcpChoutuppal @ChoutuppalTrfPS @way2_news#HeavyRains #HyderabadRains #StayAlert #StaySafe #HeavyRainfallAlert pic.twitter.com/ycwfWqQ93p
— Rachakonda Police (@RachakondaCop) July 27, 2023