నదులు, సముద్రాలు అంటే చాలా మందికి ఇష్టం. సెలవులు దొరికితే చాలు వీటి చెంతకు వెళ్లి .. నీళ్లలో ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. అలలతో ఎగసిపడుతున్న సాగరాన్ని చూసి తన్మయత్వంతో మురిసిపోతుంటాం. బయట అలలతో అలజడి సృష్టిస్తున్నా..
నదులు, సముద్రాలు అంటే చాలా మందికి ఇష్టం. సెలవులు దొరికితే చాలు వీటి చెంతకు వెళ్లి .. నీళ్లలో ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. అలలతో ఎగసిపడుతున్న సాగరాన్ని చూసి తన్మయత్వంతో మురిసిపోతుంటాం. బయట అలలతో అలజడి సృష్టిస్తున్నా.. దాన్ని చూసి ప్రశాంతత వదనంతో ఇంటికి తిరిగి వస్తుంటాం. సాగర గర్భంలో అనేక జీవరాశులు, జాతులు బతుకుతున్నాయి. అరుదైన చేప జాతులు చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. అయితే సముద్రం మీదే బతుకుతున్న అనేక కుటుంబాలకు ఇవే జీవానాధారం. సముద్రాల్లో వేటకు వెళ్లినప్పుడు అరుదైన చేపలు వలలో పడుతూ ఉంటాయి. అయితే బరువు, మార్కెట్‌లో మంచి డిమాండ్ చేపలు దొరికితే.. ఇక ఆరోజే పండుగే.
తినగలిగే, అమ్ముడయ్యే అరుదైన చేపలు పడితే.. అటువంటి వాటికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన చేపలు లక్షల్లో ధరలు పలుకుతూ ఉంటాయి. కాకినాడ మత్స్యకారులకు అటువంటి అరుదైన చేప వలకు చిక్కింది. మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండే, అరుదైన చేప కచిడి దొరికింది. దీని బరువు 20 కేజీలు. కుంభాభిషేకం రేవులో జాలర్ల వలలో ఈ చేప పడింది. ఈ చేపను మార్కెట్ తీసుకెళ్లగా రూ. 3.30లక్షలకు అమ్ముడయ్యింది. ఈ చేపలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. మెడిసిన్ తయారీలో చేపను వినియోగిస్తుంటారు. ఈ చేపలో ఉండే బ్లాడర్ కు చాలా డిమాండ్ ఉంటుంది.
ఈ అరుదైన చేపకు లక్షల్లో డిమాండ్ ఉంటుందని జాలర్లు చెబుతున్నారు. కచిడి చేప నుంచి తీసే పదార్థాలతో డాక్టర్లు ఆపరేషన్ చేసిన అనంతరం వేసే కుట్లుకు దారం తయారు చేస్తున్నారు. తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. పిత్తాశయం, ఊపిరితిత్తుల వ్యాధులను నయం చేస్తుందట. ఈ చేపకు దేశ, విదేశాల్లో మంచి డిమాండ్ ఉంటుందని వ్యాపారస్థులు చెబుతున్నారు. గతంలో కూడా అనేక సార్లు ఇటువంటి చేపలు పడ్డాయి. గతంలో ఓ చేప రికార్డు స్థాయిలో రూ. లక్షలకు అమ్ముడయ్యింది.