మందు బాబులకు రోజంతా దుకాణాలు తెరిచే ఉండాలే కానీ.. సంపాదించినంతా మద్యానికి తగులబెడుతూ..ప్రభుత్వానికి బెస్ట్ టాక్స్ పేయర్లుగా మిగిలిపోతున్నారు. అందుకే వీధికో, సంధుకొకటి బార్, బీర్ షాపులు వెలుస్తున్నాయి. ఫ్రీగా దొరికితే.. వదిలేస్తారా చెప్పండి. అదే జరిగింది ఆ ఊరిలో
మందు బాబులకు రోజంతా దుకాణాలు తెరిచే ఉండాలే కానీ.. సంపాదించినంతా మద్యానికి తగులబెడుతూ..ప్రభుత్వానికి బెస్ట్ టాక్స్ పేయర్లుగా మిగిలిపోతున్నారు. అందుకే వీధికో, సంధుకొకటి బార్, బీర్ షాపులు వెలుస్తున్నాయి. రోజంతా కష్టపడిన సొమ్ముతో కూలీ, జీతం రాగానే ఆడబ్బుతో మధ్య తరగతి మానవుడు.. మందుకు తన వంతు ఖర్చుపెట్టాల్సిందే. అప్పుడు గానీ నిద్ర పట్టదు. తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచిందని, స్నేహితులు కూడా వీరికి తోడవుతారు. పెళ్లాం, పిల్లల్ని పోషించేందుకు ఎవరైనా డబ్బులు ఇవ్వమంటే ఇవ్వరు కానీ.. అదేంటో స్నేహితులకు మందు పోసేందుకు దండిగా దుడ్డును ఖర్చుపెడుతుంటారు. హద్దు, పొద్దు లేని ఆనందంలో మునిగి తేలిపోతుంటారు. ఇక ఫ్రీగా దొరికితే.. వదిలేస్తారా చెప్పండి. అదే జరిగింది ఆ ఊరిలో
మద్యం బాటిళ్ల లోడుతో వెళుతున్న మినీ వ్యాన్ బోల్తా కొట్టింది. దీంతో మద్యం సీసాలన్నీ రోడ్డున పడ్డాయి. కొన్ని ధ్వంసం కాగా, కొన్ని బాగున్న బాటిల్స్ ను దారి వెంట వెళ్లేవారు, సమీప గ్రామ ప్రజలు ఎగబడి మరీ ఎత్తుకెళ్లారు. ఈ ఘటన కాకినాడ జిల్లా తుని మండలం గవరయ్య కోనేరు సమీపంలో జరిగింది. సామర్లకోట నుండి మద్యం లోడుతో తుని వెళుతున్న వ్యాన్ టైర్ పంక్చర్ కావడంతో బోల్తా పడింది. దీంతో బీరు, మద్యం బాటిళ్లు పడిపోయాయి. ఇక ఆ మార్గంలో వెళ్లిన వారు..పెద్ద యెత్తున అక్కడకు చేరుకుని దొరికినంతా దోచుకో అన్న చందంగా ఎత్తుకెళ్లారు. వ్యాన్ డ్రైవర్ తీసుకెళ్లవద్దని మొత్తుకున్నా వినలేదు. స్థానికులు సైతం తీసుకెళ్లవద్దని చెప్పినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. సమాచారం పోలీసులకు తెలియడంతో అక్కడకు వచ్చి వారిని కంట్రోల్ చేశారు. కాగా, ఈ నేపథ్యంలో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్‌ను పోలీసులు పునరద్ధరించారు. ఆ తర్వాత మరో వాహనంలో ఆ బాటిల్స్‌ను తరలించారు.