మాదక ద్రవ్యాలు, మందు, పొగతాగడం వంటి చెడు అలవాట్లు.. మన జీవితాలను ఎంత నాశనం చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అలవాట్ల బారిన పడి.. జీవితాలను నాశనం చేసుకోవడమే కాక.. మృతి చెందుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇక నేటి కాలంలో.. పట్టుమని పదేళ్లు కూడా లేని పిల్లలు సైతం.. ఈ చెడు అలవాట్ల బారిన పడుతూ.. నిండు నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇక ఆడవారు కూడా తాము ఎందులో తక్కువ కాదు.. మరి ఇలాంటి వ్యసనాలను అలవర్చుకోడంలో మాత్రం.. ఎందుకు వెనకపడాలి అని అనుకుంటూ.. చెడు అలవాట్ల బారిన పడుతున్నారు. అంతటితో ఆగక.. కొన్ని సార్లు.. రోడ్ల మీదకు వచ్చి హల్చల్ చేయడమే కాక.. అడ్డుకోబోయిన అధికారులు, జనాల మీద విరుచుకుపడతారు. వారిపై దాడి చేయడానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. గంజాయి మత్తులో ఓ యువతి.. పోలీసులను బూతులు తిట్టడమే కాక.. బీర్ బాటిల్‌తో దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఆ వివరాలు..
ఈ సంఘటన విశాఖపట్నంలో వెలుగు చూసింది. పట్టణంలోని వైఎంసీఏ దగ్గర మద్యం, గంజాయి మత్తులో ఓ యువతి బుధవారం అర్ధరాత్రి హల్చల్ చేసింది. సదరు యువతి నడిరోడ్డుపై బీరు తాగుతూ.. గంజాయి సిగరెట్ కాలుస్తుందని స్థానికులు.. త్రీ టౌన్ ఏఎస్ఐ పీవీవీ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వచ్చి.. యువతి చేష్టలపై ఆమెను ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన యువతి.. ఏఎస్‌పై సత్యనారాయపై బీర్ బాటిల్‌తో దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే ప్రమాదం గమనించిన ఏఎస్‌పై పక్కకు తప్పుకోవడంతో.. అది కాస్త.. అక్కడే ఉన్న గోవింద్ అనే యువకుడు కంటికి తగిలింది. ఫలితంగా అతడికి తీవ్ర గాయం అయ్యింది.
దాంతో పోలీసులు.. యువతిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. వాళ్లపై విరుచుకుపడింది. ఏఎస్‌ఐ సత్యనారాయణపై బూతుపురాణం అందుకుంది. నోటికి వచ్చినట్లు.. బూతులు తిట్టింది. అంతేకాక ఏఎస్ఐ సత్యనారాయణపై అసభ్య వ్యాఖ్యలు చేస్తూ.. అతడిని కాలితో తన్నేందుకు ప్రయత్నించింది. ఇదంతా చూసిన స్థానికులు.. సదరు యువతి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఓ యువకుడు.. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో యువతిపై ఫిర్యాదు చేసి.. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరాడు.
ఇక సదరు యువతి తన ప్రియుడు దుర్గాప్రసాద్ అలియాస్ ఏటీఎం అనే వ్యక్తికి ఈ విషయం చెబితే మీ పని అయిపోతుందని పోలీసులపైకి బెదిరింపులకు దిగింది. మీరు పోలీసులైతే నన్నేం చేయగలరు అంటూ బూతులతో రెచ్చిపోయింది. అంతేకాక.. పోలీసులను సవాల్ చేస్తూ నానా హంగామా చేసి.. అక్కడ భయానక వాతావరణం సృష్టించింది. చివరకు పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మరి యువతి ప్రవర్తనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.