భక్తుల పాలిట కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి తమిళనాడుకు చెందిన భక్తులు భారీ విరాళాన్ని అందజేశారు. తమిళనాడుకు చెందిన నలుగురు భక్తులు.. శ్రీవారికి రూ. 10 కోట్లు విరాళాల్నిఅందజేసి స్వామివారి పట్ల వారికున్న భక్తిని చాటుకున్నారు. తిరునల్వేలికి చెందిన గోపాల బాలకృష్ణన్ అనే భక్తుడు ఏకంగా రూ. 7 కోట్లు స్వామివారికి సమర్పించుకున్నాడు.
తిరునల్వేలికి చెందిన భక్తుడు గోపాల బాలకృష్ణన్.. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో ఉన్న అన్నదానం ట్రస్టుతో పాటు 7 ట్రస్టులకు రూ.7 కోట్లను విరాళంగా అందించారు. అలాగే.. ‘ఎ స్టార్ టెస్టింగ్ అండ్ ఇన్‌స్పెక్షన్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థ కోటి రూపాయలు, ‘బాలకృష్ణ ఫ్యూయల్ స్టేషన్’ సంస్థ శ్రీవాణి ట్రస్టుకు కోటి రూపాయలు, ‘సీహబ్ ఇన్‌స్పెక్షన్ సర్వీసెస్’ సంస్థ ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు కోటి రూపాయలు విరాళంగా అందించాయి. టీటీడీ ఈఓ కార్యాలయంలో జేఈఓ ధర్మారెడ్డికి దాతలు ఈ విరాళాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. తిరుమల శ్రీవారికి ఇలా ఒక్క రోజే భారీ స్థాయిలో విరాళం రావడం ఈ ఏడాది ఇదే తొలిసారని అధికారులు చెప్పారు.
Tirumala Tirupati Devasthanams received a record donation of Rs. 10 crore from Tirunalveli based Tamil Nadu devotee Gopala Balakrishnan group on Monday. TTD EO AV Dharma Reddy who received the donation thanked the donor for his magnanimous gesture. Om Namo Venkatesaya! pic.twitter.com/V2ZWaDgbU4
— Sandeepraghavan_Tirupati@TOI (@Sandeep19689759) June 6, 2022
ఇది కూడా చదవండి: Farming: కొడుకులే కాడెద్దులు.. కన్నీళ్లు పెట్టిస్తున్న రైతు కష్టాలు..
ఇక.. ఒక్క రోజే ఇంత మొత్తంలో విరాళాలు రావడం టీటీడీ చరిత్రలో ఇది కేవలం రెండోసారి మాత్రమే కావడం గమనార్హం. గతేడాది ఫిబ్రవరిలో ఢిల్లీకి చెందిన ఓ భక్తుడు రూ.10 కోట్లు విరాళంగా అందజేశారు. ఢిల్లీకి చెందిన సంజయ్ పస్సీ, షాలినీ దంపతులు 2021 ఫిబ్రవరి 26న తిరుమల శ్రీవారిని దర్శించుకొని అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ అధికారులకు రూ.10 కోట్ల విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు.