రాజకీయ పార్టీలకు విరాళాలు అందుతాయనే సంగతి తెలిసిందే. అత్యధిక విరాళాలు అందుకున్న ప్రాంతీయ పార్టీల జాబితాలో.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు టాప్‌లో నిలిచాయి. ఆ వివరాలు..
మనది ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది. మన ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకునే తీరిక, సమయం ఉండటం లేదు.. ఇక అలాంటిది మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునే తీరక, సమయం ఇంకెక్కడ ఉంటుంది. ఇక సోషల్ మీడియా పుణ్యమా అని.. దొరికే కొంచెం సమయాన్ని కూడా.. దానికే కేటాయిస్తున్నాం. ఏదైనా విచారకర సంఘటన గురించి తెలిస్తే.. ఏదో నాలుగు ముక్కలు కామెంట్స్ చేసి వదిలేస్తాం. ఆ తర్వాత మరో పోస్ట్.. మరో పోస్ట్. ఇలా కొనసాగుతుంది. […]
డబ్బు విషయంలో చాలా మంది వైఖరి ఎలా ఉంటుంది అంటే.. మనం బతకాడానికి మాత్రమే కాక మన తర్వాత తరాలు వాళ్లు కూడా కూర్చుని తినగలగేంత సంపాదించాలి అని భావిస్తారు. తమ చుట్టూ పేదవారు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు ఎందరు ఉన్నా.. అలాంటి వారిని ఆదుకోవడానికి ముందుకు రారు. అయితే కొందరు మాత్రం.. సమాజాన్ని తమ కుటుంబంలానే ప్రేమిస్తారు.. దాని అభివృద్ధి కోసం పరితపిస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో చోటు […]
సమాజం కోసం ఆలోచించి కోట్ల రూపాయలను దానం చేసే పారిశ్రామికవేత్తలు ఉంటారు. ఇప్పటికీ టాటా గ్రూప్ కంపెనీ తన లాభాల్లో 60 శాతం ఛారిటీలకే ఇస్తుంది. ఆస్తిని సైతం లెక్క చేయకుండా కొంతమంది తమ యావదాస్తిని విరాళంగా ఇస్తుంటారు. రెండు నెలల క్రితం ఉత్తరప్రదేశ్ కి చెందిన అరవింద్ కుమార్ గోయల్ అనే డాక్టర్, పారిశ్రామిక వేత్త కేవలం ఇంటిని మాత్రమే ఉంచుకుని 600 కోట్ల రూపాయల ఆస్తిని పేదల కోసం విరాళంగా ఇచ్చేసి గొప్ప మనసు […]
ప్రస్తుతం శ్రీలంక రావణ కాష్ఠంగా మారిన సంగతి తెలిసిందే. ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక ప్రజలకు సహాయం అందిస్తున్న యూనిసెఫ్ కి తమ వంతు విరాళాన్ని ప్రకటించి పెద్ద మనసు చాటుకుంది ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు. ఇటీవలే లంకలో మూడు టీ20లు, వన్డే, టెస్ట్ సిరీస్ లు ఆడిన ఈ ఆస్ట్రేలియన్ క్రికెటర్లు.. లంకలో నెలకొన్న దుస్థితిని దగ్గరుండి చూసి చలించిపోయారు. ఇన్ని కష్టాల్లోనూ శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లను లంక ప్రజలు ఆదరించారు. […]
సాధారణంగా ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరు.. నెలకు ఒకటి, అరా.. లేదంటే రెండు మూడు నెలలకు కలిపి ఒకేసారి 3-4 రోజుల సెలవులు పెడతారు. ఎంత పెద్ద పొజిషన్‌లో ఉన్న ఉద్యోగి అయినా సరే.. ఏడాదికి ఒక్కసారైనా కచ్చితంగా సెలవు పెడతారు. అసలు ఏళ్ల తరబడి సెలవు అనేది లేకుండా పని చేయడం అంటే సాధ్యం అయ్యే పని కూడా కాదు. ఇంట్లో వాళ్లకో, మనకో అనారోగ్యం తలెత్తవచ్చు. మన ఆత్మీయులు ఎవరైనా దూరం కావచ్చు. ఇలా […]
భక్తుల పాలిట కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి తమిళనాడుకు చెందిన భక్తులు భారీ విరాళాన్ని అందజేశారు. తమిళనాడుకు చెందిన నలుగురు భక్తులు.. శ్రీవారికి రూ. 10 కోట్లు విరాళాల్నిఅందజేసి స్వామివారి పట్ల వారికున్న భక్తిని చాటుకున్నారు. తిరునల్వేలికి చెందిన గోపాల బాలకృష్ణన్ అనే భక్తుడు ఏకంగా రూ. 7 కోట్లు స్వామివారికి సమర్పించుకున్నాడు. తిరునల్వేలికి చెందిన భక్తుడు గోపాల బాలకృష్ణన్.. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో ఉన్న అన్నదానం ట్రస్టుతో […]
భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ తన మంచి మనసును చాటుకున్నాడు. ఆపదలో ఉన్న ఓ బాలుడి ప్రాణం కాపాడాడు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ బాలుడికి రూ.31 లక్షల ఆర్ధిక సాయం చేసి.. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. పూర్తి వివరాలు.. సచిన్ నలవడే- స్వప్నఝా దంపతులకు వరద అనే 11 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. సచిన్ ఇన్యూరెన్స్ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. స్వప్న హౌస్ వైఫ్. అయితే వారి కుమారుడికి అరుదైన వ్యాధి ఉంది. అందుకు […]
చేతికి అంది వచ్చిన కొడుకు ఇక తమ బాధ్యతలు నిర్వర్తిస్తాడనే భరోసాతో ఆ తల్లిదండ్రులు ధైర్యంగా, ధీమాగా ఉన్నారు. కుటుంబ బాధ్యతలు కుమారుడికి అప్పగించి.. తాము విశ్రాంతి తీసుకోవాలని భావించారు. కానీ విధి నిర్ణయం మరోలా ఉంది. మద్యం మహమ్మారి వారి ఇంట ఆరని చిచ్చు పెట్టింది. ఆసరాగా నిలుస్తాడని భావించిన కుమారుడు.. బతికున్న శవంలా మారాడు. బిడ్డ ఎన్నటికి కోలుకోలేడు అని తెలిసిన ఆ తల్లిదండ్రులు శోకాన్ని దిగమింగుకుని తీసుకున్న నిర్ణయం మరో ఐదుగురి ఇంట […]
ప్రధాని నరేంద్ర మోదీ.. బీజేపీ బలోపేతం కోసం విరాళాలు ఇవ్వాల్సిందిగా కార్యకర్తలను కోరుతున్నారు. తాను ఇప్పటికే పార్టీ ఫండ్ గా రూ. 1000 ఇచ్చానని చెప్పడమే కాక ఇందుకు సంబంధించిన రిసిప్ట్ ను ట్విటర్ లో పోస్ట్ చేశారు. బీజేపీని బలోపేతం చేసేందుకు విరాళాలు ఇవ్వాల్సిందిగా కార్యకర్తలను కోరారు. ఈ క్రమంలో ‘నేను బీజేప కోసం పార్టీ ఫండ్ గా రూ. 1000 చెల్లించాను. దేశానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనేది మన ఉద్దేశం. మైక్రో డోనేషన్ ద్వారా […]