సాధారణంగా ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరు.. నెలకు ఒకటి, అరా.. లేదంటే రెండు మూడు నెలలకు కలిపి ఒకేసారి 3-4 రోజుల సెలవులు పెడతారు. ఎంత పెద్ద పొజిషన్‌లో ఉన్న ఉద్యోగి అయినా సరే.. ఏడాదికి ఒక్కసారైనా కచ్చితంగా సెలవు పెడతారు. అసలు ఏళ్ల తరబడి సెలవు అనేది లేకుండా పని చేయడం అంటే సాధ్యం అయ్యే పని కూడా కాదు. ఇంట్లో వాళ్లకో, మనకో అనారోగ్యం తలెత్తవచ్చు. మన ఆత్మీయులు ఎవరైనా దూరం కావచ్చు. ఇలా ఏదో ఒక సందర్బంలో ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు సెలవు పెట్టాల్సింది. కానీ ఇప్పుడు మీరు తెలుసుకోబోయే వ్యక్తి వీటికి విరుద్ధం. ఎందుకంటే.. అతడు ఉద్యోగంలో చేరి ఇప్పటికి దాదాపు 30 ఏళ్లు కావస్తోంది. కానీ ఇప్పటి వరకు అతడు ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. ఈ విషయం గుర్తించిన కంపెనీ.. అతడికి ఓ చిన్న కానుక ఇచ్చింది. అసలు అన్నేళ్లు.. అంత ఓపికగా పని చేయడమే ఎక్కువ. అందులోనూ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా.. అది మరింత పెద్ద విషయం. కానీ కంపెనీ దాన్ని గుర్తించకుండా.. అతడికి చిరు కానుక ఇచ్చి అవమానించింది అని భావించిన నెటిజనులు.. సదరు ఉద్యోగిపై తమ ప్రేమను చాటుతూ.. విరాళాలు ఇచ్చారు. ఆ మొత్తం 2 కోట్ల రూపాయలకు పైగా జమ అయ్యింది. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
అమెరికాలోని లాస్ వేగాస్‌కి చెందిన 54 ఏళ్ల కెవిన్ ఫోర్డ్ గత 27 ఏళ్లుగా బర్గర్ కింగ్ సంస్థలో పని చేస్తున్నాడు. ఇక తన 27 ఏళ్ల సర్వీసులో అతడు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. ఇందుకు గాను అతను పనిచేస్తున్న బర్గర్ కింగ్ సంస్థ ఇటీవల అతనికి ఓ కానుక ఇచ్చింది. ఒక చిన్న బ్యాగ్‌లో సినిమా టికెట్, కొన్ని చాక్లెట్స్, మింట్స్, స్టార్ బక్స్ కప్‌ను ప్యాక్ చేసి ఇచ్చింది. నిజానికి అతని సేవలకు ఆ సంస్థ ఇచ్చిన గిఫ్ట్ చాలా చిన్నదే అయినా అతను సంతోషంగా స్వీకరించాడు.
ఇది కూడా చదవండి: Samsung: పాకిస్తాన్ ప్రజలకు శాంసంగ్ క్షమాపణలు.. కారణం?
సంస్థ ఇచ్చిన గిఫ్ట్ పట్ల అతను సంతోషంగానే ఉన్నప్పటికీ.. నెటిజన్లకు మాత్రం ఈ విషయం తీవ్ర ఆగ్రహం తెప్పించింది. 27 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా లీవు తీసుకోకుండా కష్టపడి పనిచేస్తే.. అతనికిచ్చే గుర్తింపు, గౌరవం ఇదేనా అంటూ పలువురు నెటిజన్లు బర్గర్ కింగ్ సంస్థపై మండిపడ్డారు. ఇది ఒకరకంగా కెవిన్‌ని అవమానించడమేనని కామెంట్ చేశారు. ఇదే క్రమంలో కెవిన్ ఫోర్డ్ కూతురు తన తండ్రి కోసం ఏదైనా చేయాలనుకుంది. వెంటనే సోషల్ మీడియాలో గోఫండ్‌మీ అనే పేజీ ద్వారా తన తండ్రి కోసం విరాళాలు సేకరించడం మొదలుపెట్టింది. అందులో తన తండ్రికి ఎదురైన అనుభవం గురించి వివరించింది. దీంతో నెటిజన్లు కెవిన్ ఫోర్డ్ పట్ల తమ ప్రేమను విరాళాల రూపంలో కురిపించారు.
ఇది కూడా చదవండి: Abortion: పాపం ఎల్సీ.. అబార్షన్ అయిందని 30 ఏళ్ల జైలు శిక్ష విధించారు!
నెటిజన్ల నుంచి భారీ స్పందన రావడంతో దాదాపు రూ.2.36 కోట్లు విరాళంగా వచ్చాయి. మొదట హాలీవుడ్ నటుడు డేవిడ్ స్పేడ్ తనవంతుగా రూ.3.9 లక్షలు విరాళంగా ఇచ్చాడు. డేవిడ్ బాటలో మరికొందరు భారీగా విరాళాలు ఇవ్వడంతో రూ.2 కోట్ల పైచిలుకు వసూలైంది. ఈ మొత్తాన్ని తన తండ్రికి ఇవ్వనున్నట్లు కెవిన్ ఫోర్డ్ కూతురు తెలిపింది. తనకు ఆ డబ్బు వచ్చినా సరే.. తాను మాత్రం యథావిధిగా తన పని తాను చేసుకుంటానని కెవిన్ ఫోర్డ్ చెప్పడం అతని వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పకనే చెబుతోంది. కెవిన్ వ్యక్తిత్వానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Love: 11 ఏళ్లకే ప్రేమ.. లవర్ తండ్రిని ప్రేమించిన అమ్మాయి!..
Internet Raises Almost $200k For Employee That Went Viral For Burger King Video Getting Only A Goodie Bag Serving Them for 27yrs💵🍔 pic.twitter.com/Wm8v5K8rGb
— raphousetv (@raphousetv2) June 29, 2022