భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ తన మంచి మనసును చాటుకున్నాడు. ఆపదలో ఉన్న ఓ బాలుడి ప్రాణం కాపాడాడు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ బాలుడికి రూ.31 లక్షల ఆర్ధిక సాయం చేసి.. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
పూర్తి వివరాలు.. సచిన్ నలవడే- స్వప్నఝా దంపతులకు వరద అనే 11 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. సచిన్ ఇన్యూరెన్స్ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. స్వప్న హౌస్ వైఫ్. అయితే వారి కుమారుడికి అరుదైన వ్యాధి ఉంది. అందుకు చికిత్స చేయాలంటే వరదకు రోగ నిరోధక శక్తి చాలా తక్కువ ఉంది. అతని పరిస్థితి ఏంటంటే.. వరదకు జ్వరం వచ్చినా అది తగ్గాలంటే నెల రోజులు పడుతుంది. అతడిని కాపాడాలి అంటే బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ తప్ప మరో దారి లేదని వైద్యులు తెలిపారు.
అందుకు దాదాపు రూ.35 లక్షల ఖర్చు అవుతుంది. తల్లిదండ్రులకు ఏం చేయాలో తెలియక గివ్ ఇండియాలో ఓ ఫండ్ రైజర్ ప్రారంభించారు. వరద పరిస్థితి గురించి తెలుసుకోగానే రాహుల్ తన బృందంతో అన్ని వివరాలు తెప్పించుకున్నాడు. అతని శస్త్ర చికిత్స కోసం రూ.35 లక్షలు ఖర్చవుతుందని తెలియగా.. అందులో తన వంతుగా రూ.31 లక్షలు డొనేట్ చేశాడు. ‘బాలుడి గురించి తెలియగానే నా బృందం వన్ ఇండియా నుంచి అన్ని వివరాలు సేకరించారు. అతని ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని తెలిసి చాలా సంతోషంగా ఉంది. అతను త్వరలో తన కాళ్లపై తాను నిలబడాలని ఆకాంక్షిస్తున్నా. తన కలలను నిజం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను చేసిన ఈ పనితో మరికొంత ముందుకొచ్చి అలాంటి వారికి సహాయం చేస్తారని భావిస్తున్నాను’ అంటూ కేఎల్ రాహుల్ అభిప్రాయపడ్డాడు.
‘కేఎల్ రాహుల్ కు మేము ఎంతే రుణపడి ఉంటాము. ఆయన అంత పెద్ద మొత్తంలో సాయం చేయబట్టే.. వరద ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. రాహుల్ స్పందించడం వల్లే ఆ సర్జరీ అంత వేగంగా జరిగిపోయింది’ అంటూ వరద తల్లి స్వప్న కృతజ్ఞతలు తెలిపారు. కేఎల్ రాహుల్ చేసిన ఈ సాయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#ipl #LucknowSuperGiants #KLRahul pic.twitter.com/Or7tMTtR2w
— S.K.L SUPER KINGS LUCKNOW (@Sagar360ABD) February 22, 2022