సమాజం కోసం ఆలోచించి కోట్ల రూపాయలను దానం చేసే పారిశ్రామికవేత్తలు ఉంటారు. ఇప్పటికీ టాటా గ్రూప్ కంపెనీ తన లాభాల్లో 60 శాతం ఛారిటీలకే ఇస్తుంది. ఆస్తిని సైతం లెక్క చేయకుండా కొంతమంది తమ యావదాస్తిని విరాళంగా ఇస్తుంటారు. రెండు నెలల క్రితం ఉత్తరప్రదేశ్ కి చెందిన అరవింద్ కుమార్ గోయల్ అనే డాక్టర్, పారిశ్రామిక వేత్త కేవలం ఇంటిని మాత్రమే ఉంచుకుని 600 కోట్ల రూపాయల ఆస్తిని పేదల కోసం విరాళంగా ఇచ్చేసి గొప్ప మనసు చాటుకున్నారు. ఈ తరహాలోనే మరొక డాక్టర్ తన ఉదార మనసు చాటుకున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన డాక్టర్ ఉమ గవిని తన 20 కోట్ల రూపాయల ఆస్తిని గుంటూరు జీజీహెచ్ కి విరాళంగా ఇచ్చేశారు.
గుంటూరు జిల్లాకి చెందిన ఉమ గవిని.. గుంటూరు మెడికల్ కాలేజ్ లో 1965లో మెడిసన్ చేశారు. ఆ తర్వాత ఉన్నత విద్య పూర్తి చేసిన ఈమె 40 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే స్పెషలిస్ట్ డాక్టర్ గా స్థిరపడ్డారు. ఇమ్యునాలజిస్ట్, అలర్జీ స్పెషలిస్ట్ గా పని చేస్తున్నారు. మూడేళ్ళ క్రితం ఈమె భర్త చనిపోయారు. వారసులు కూడా లేరు. దీంతో 50 ఏళ్లుగా కష్టపడి సంపాదించుకున్న ఆస్తి మొత్తాన్ని విరాళంగా ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు. 20 కోట్ల రూపాయలను గుంటూరు జీజీహెచ్ లో కొత్తగా నిర్మితమవుతున్న మాతా శిశు సంక్షేమ భవనానికి విరాళంగా ఇచ్చారు. గత నెలలో డల్లాస్ లో గుంటూరు ఓల్డ్ స్తూడెంట్స్ విద్యార్థుల సంఘం, ఉత్తర అమెరికా (జింకానా) 17వ రీయూనియన్ సమావేశాలకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె తాను మెడిసన్ చేసిన జీజీహెచ్ కి ఆస్తిని ఇస్తున్నట్లు ప్రకటించారు.
#జీజీహెచ్‌కు యావదాస్తి!
20 కోట్ల ఆస్తి ఆస్పత్రికి అమెరికాలో స్థిరపడిన గుంటూరు వైద్యురాలు డాక్టర్ #ఉమా_గవిని ఔదార్యం..
వారసులు లేరు.. ఇటీవలే భర్త కూడా మృతి, దీంతో తాను చదివిన జీజీహెచ్‌కు భారీవిరాళం..
యాభైఏళ్లుగా కష్టపడి కూడబెట్టిన తన యావదాస్తినీ తృణప్రాయంగా దానం చేసేశారు pic.twitter.com/wLlI9X8bHi
— శివశంకర కలకొండ (@janakishivasha2) October 5, 2022
కాగా జీజీహెచ్ లోని ఒక బ్లాకుకు డాక్టర్ ఉమ పేరుని, మరొక బ్లాకుకి ఆమె భర్త డాక్టర్ కానూరి రామచంద్రరావు పేరుని పెట్టాలని జింకానా సభ్యులు నిర్ణయించారు. అయితే మా పేరులేమీ వద్దని ఉమ అన్నారు. ఇక ఈమె 2008లో జింకానా అధ్యక్షురాలిగా ఉన్నారు. ఈమె భర్త కర్ణాటకలోని గుల్బర్గాలో మెడిసన్ చేసి.. అనస్థటిక్ గా పని చేశారు. మూడేళ్ళ కిందట కన్ను మూశారు. జీవితాంతం కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఉన్నా అనుభవించడానికి నా అనే వాళ్ళు లేకపోతే ఆ బాధ వర్ణనాతీతం. అనుభవించే వాళ్ళు లేని ఆస్తి కోట్లున్నా గానీ శూన్యమే. అందుకే కాబోలు ఈ డాక్టరమ్మ ఏకంగా తన 20 కోట్ల రూపాయల ఆస్తిని తృణప్రాయంగా వదులుకున్నారు. దీంతో డాక్టరమ్మ చేసిన పనికి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఒక మహిళా వైద్యురాలు. కర్ణుడి దానగుణాన్ని వర్ణించిన మహాభారత ఘట్టాన్ని ఆధునిక భారతంలో గొప్పగా ఆవిష్కరించారు. భర్త మూడేళ్ల కిందట మృతి చెందటం, వారసులు లేకపోవడంతో డాక్టర్ #ఉమ_గవిని తన ఆస్తినంతా #గుంటూరు జీజీహెచ్‌కు ఇచ్చేశారు. చివరికి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మిగుల్చుకోలేదు.. pic.twitter.com/0HHozqUrVS
— శివశంకర కలకొండ (@janakishivasha2) October 5, 2022