Metal Ring: ఈ మధ్య కాలంలో కొంతమంది వ్యక్తులు చేస్తున్న పనులు చూస్తే మతిపోతోంది. అసలు బుద్ధి ఉండే ఆ పనులు చేస్తున్నారా? లేక పిచ్చి పట్టిందా? అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వారి పిచ్చి చేష్టలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా, థాయ్‌లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి తన మర్మాంగం సైజు పెరగటానికి తల తిక్కపని చేశాడు. ఏకంగా ఓ మెటల్ రింగ్‌ను తన అంగానికి తొడుక్కున్నాడు. అలా నాలుగు నెలలు ఆ రింగ్‌ను ఉంచుకున్నాడు. చివరకు ఆస్పత్రి పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. థాయ్‌లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి గత నాలుగు సంవత్సరాల నుంచి ఓ వింత, వికారమైన పనిని చేస్తున్నాడు.
తన అంగం సైజు పెరుగుతుందన్న ఆలోచనతో దానికి మెటల్ రింగ్‌ను తొడుక్కుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే నాలుగు నెలల క్రితం కూడా తన అంగానికి మెటల్ రింగ్ తొడిగాడు. తనం అంగం లావుగా అవుతుందని అతడు భావించాడు. కానీ, అలా జరగలేదు. రింగ్ పెట్టిన చోట రక్త ప్రసరణకు ఆటంకం కలిగి వాపు వచ్చింది. ఆ వాపుతోటే అతడు నాలుగు నెలలు గడిపాడు. వాపు తాలూకా నొప్పి పెరిగింది. ఆ నొప్పి తట్టుకోలేక చివరకు క్రుగ్‌తాయ్ జనరల్ ఆసుపత్రికి వెళ్లాడు.
అక్కడి వైద్యులు ఆ వ్యక్తి చేసిన పనికి ఆశ్చర్యపోయారు. దాన్ని ఎలా బయటకు తీయాలో వారికి అర్థం కాలేదు. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఆస్పత్రిలో ఆపరేషన్‌కు సిద్ధం చేశారు. ఆస్పత్రికి వచ్చిన ఫైర్ సిబ్బంది కట్టర్‌తో రింగ్‌ను తొలిగించారు. అయితే, రింగ్‌ను కట్ చేయటానికి ఫైర్ సిబ్బంది చాలా కష్టపడ్డారు. వారి గంట శ్రమ ఫలించి రింగ్ కట్ అయింది. ఎక్కువ కాలం రింగ్‌ను పెట్టుకున్న కారణంగా అంగానికి ఇన్‌ఫెక్షన్ వచ్చుంటుందేమో.. అంగాన్ని కట్ చేయాల్సి వస్తుందేమోనని డాక్టర్లు భావించారు. కానీ, అలా జరగలేదు.
బాధితుడు క్షేమంగా బయటపడ్డాడు. ఇక, ఈ ఘటనపై ఆపరేషన్‌లో భాగమైన సోమ్‌చాయ్ చోక్‌చాయ్ మాట్లాడుతూ.. ‘‘ ఆ వ్యక్తి మెటల్ రింగ్‌ను నాలుగేళ్లుగా తొడుక్కుంటున్నానని చెప్పాడు. ముందెప్పుడూ ఇలా జరగలేదన్నాడు. నాలుగు నెలల క్రితం పెట్టుకున్నాడు. తన అంగం పరిణామం పెరుగుతుందనుకున్నాడు. కానీ, ఆ ప్రాంతలో రక్త ప్రసరణ సరిగా జరగలేదు. దీంతో అంతా ఉబ్బిపోయింది’’ అని పేర్కొన్నాడు.