గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ లో అధికార పక్షం వైసీపీ వర్సెస్ ప్రతిపక్షం టీడీపీకి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఏ చిన్న ఛాన్స్ దొరికినా అధికార పక్షాన్ని ఇరుకున పడేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అంతే కాదు ఇరు పక్ష నాయకులు మాటల యుద్దానికి దిగుతున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది.
ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌లో శుక్రవారం సాయంత్రం ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం కాకినాడ జిల్లా చేరుకున్న చంద్రబాబు.. గొల్లప్రోలులో పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు తమ ఊరికి వస్తున్న సందర్భంగా అక్కడ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ క్రమంలో చంద్రబాబు కాన్వాయ్‌లోని ఓ కారును పట్టుకుని ముందుకు సాగిన టీడీపీ కార్యకర్త ఒకరు పట్టు తప్పి కింద పడిపోయారు.
ఈ క్రమంలో చంద్రబాబు కాన్వాయ్‌లోని ఓ కారును పట్టుకుని ముందుకు సాగిన టీడీపీ కార్యకర్త ఒకరు పట్టు తప్పి కింద పడిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కార్యకర్తను దగ్గరలోని హాస్పిటల్ కి తరలించారు. పర్యటనలో జరిగిన అపశృతి గురించి చంద్రబాబు నాయుడు తెలుసుకొని ఆ కార్యకర్తకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని పార్టీ శ్రేణులకు, డాక్టర్లను కోరినట్లు తెలుస్తుంది. ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలు తిప్పి కొట్టాలని.. ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చేందుకు టీడీపీ అహర్శిశలూ ప్రయత్నాలు కొనసాగిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. విపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉందని ప్రకటించారు.