విశాఖ నగరాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలకు రూపుదిద్దుకుంటున్నాయి. తర్వరలోనే విశాఖ నగరానికి సీప్లేన్ సర్వీస్ రానున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన కార్యచరణ కూడా రూపుదిద్దుకుంటోంది. ఉన్నతస్థాయిలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే మాల్దీవుల్లో సూపర్ సక్సెస్ అయిన సీప్లేన్ సర్వీస్ ను ఇండియాలోనూ పరిచయం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇప్పటికే దేశవ్యాప్తంగా 28 సీప్లేన్ మార్గాలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాకపోతే ఈ సీప్లేన్ సర్వీస్ కోసం వాటర్ ఏరోడోమ్ లను నిర్మించాల్సి ఉంటుంది. రూ.287 కోట్లతో 6 రాష్ట్రాలు/యూనియన్ టెరిటరీల్లో 14 వాటర్ ఏరోడోమ్ లు నిర్మించేందుకు కేంద్రం సిద్ధమైంది. కేంద్రం చేపడుతున్న 14 ఏరోడోమ్ నిర్మాణాల్లో ఒకదానిని విజయవాడకు కేటాయించారు.
నిజానికి వైజాగ్ నౌకాశ్రయంలో క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణం జరుగుతోంది. అయితే దానినే వాటర్ ఏరోడోమ్ గా వాడుకోవచ్చు నిపుణులు సూచిస్తున్నారు. అందుకు అదనపు ఖర్చు కూడా ఏమీ ఉండదని చెబుతున్నారు. అందుకు అంగీకారం లభిస్తే మాత్రం పర్యాటకంగా విశాఖ మరింత అభివృద్ధి చేందే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఈ సీప్లేన్ సర్వీస్ కు సంబంధించి రాయితీలు ఇచ్చేందుకు కేంద్రం వుడాన్ అనే పథకాన్ని కూడా తీసుకొచ్చింది. కేంద్రం ఇచ్చే రాయితీలకు అదనంగా రాష్ట్రం కూడా పన్ను రాయితీలు ఇస్తే ప్రయాణ ఖర్తు మరింత తగ్గే అవకాశం ఉంది. విశాఖకు సీప్లేన్ సర్వీస్ వచ్చేలా తప్పకుడా చర్యలు తీసుకుంటామంటూ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.
మొదట విశాఖ నుంచి భీమవరం, కాకినాడ రూట్లలో సీప్లేన్ సర్వీస్ ప్రారంభించి.. ఆ తర్వాత విజయవాడ ఏరోడోమ్ నిర్మాణం పూర్తయ్యాక విజయవాడకు కూడా సర్వీసులు ప్రారంభిస్తే బావుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. విశాఖకు సీప్లేన్ సర్వీస్ వస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.